త్రివిక్ర‌మ్ మ‌ర‌ద‌ళ్ల‌ని చూశారా.. అత‌డు నుండి గుంటూరు కారం వ‌ర‌కు…!

త్రివిక్ర‌మ్ మ‌ర‌ద‌ళ్ల‌ని చూశారా.. అత‌డు నుండి గుంటూరు కారం వ‌ర‌కు…!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆన‌తి కాలంలోనే స్టార్ డైరెక్ట‌ర్‌గా ఎదిగిన త్రివిక్ర‌మ్ ప్ర‌స్తుతం స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా థియేటర్లోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే మిశ్రమ స్పందన మూటగట్టుకుంది. దీంతో గురూజీపై ట్రోలింగ్ కూడా మొద‌లు పెట్టేశారు. గుంటూరు కారం సినిమా 30 ఏళ్ల క్రితం స్టోరీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా మలయాళ చిత్రాన్ని గుర్తుకు చేస్తుందంటూ నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.

త్రివిక్ర‌మ్ పెన్నులో ఇంక్ అయిపోయింద‌ని, ఆయ‌న గ్రంధాల‌యం ఖాళీ అయింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.అయితే త్రివిక్ర‌మ్ సినిమాల‌కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. మాట‌ల‌తో మాయ చేస్తూ అందులో బంధాలు, బంధుత్వాల‌ని ఎక్కువ‌గా హైలైట్ చేస్తాడు. హీరోలకి ఎలివేష‌న్స్ ఇస్తూ హీరోయిన్స్‌ని అందంగా చూపిస్తాడు. అలానే కొన్ని పాత్ర‌ల‌ని మాత్రం రెగ్యుల‌ర్‌గా రిపీట్ చేస్తాడు. త్రివిక్ర‌మ్ త‌న ప్ర‌తి సినిమాలో కూడా మ‌ర‌ద‌లు పాత్ర‌ని రెగ్యుల‌ర్‌గా రిపీట్ చేస్తాడు. కెరీర్ మొదటి నుంచే త‌న సినిమాల‌లో ఇద్దరు హీరోయిన్స్ ఉండి, ఒక హీరోయిన్ కి మరదలు పాత్రని పెట్టడం మ‌నం చూశాం. గత మూడు సినిమాల్లో మరదలు క్యారెక్టర్ ఉండటం, ఆ పాత్ర కోసం సపరేట్ క్యారెక్టర్ డిజైన్ చేయడం ప్ర‌త్యేకంగా చెప్పుకోవ‌చ్చు.

త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసిన చిరునవ్వుతో సినిమాలో హీరో వేణుకి మరదలు క్యారెక్టర్ లో ప్రేమ ఉంటుంది. ద‌ర్శ‌కుడిగా మారాక మ‌హేష్ హీరోగా తెర‌కెక్కించిన అత‌డు చిత్రంలో మహేష్ బాబు పాత్రకి త్రిషని మరదలుగా పెట్టాడు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ కి సమంత , ప్రణీత మరదళ్ళు అవుతారు.నితిన్ అ ఆ సినిమాలో కూడా హీరో పాత్రకి సమంత మరదలు వ‌రుస‌ అవుతుంది. అలానే అరవింద వీరరాఘవ సమేత సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ కాగా ఆమెకి చెల్లి పాత్రలో అంటే హీరోకి మరదలు వరుస అయ్యే పాత్రకి ఈషరెబ్బని దించాడు. అలవైకుంఠపురంలో సినిమాలో నివేదా పేతురాజ్ ని మరదలు పాత్రలో పెట్టారు. ఇక ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరిని మ‌ర‌దలిగా చూపించారు. మొత్తానికి త్రివిక్ర‌మ్ సినిమాల‌లో మ‌ర‌ద‌లి పాత్ర రెగ్యుల‌ర్‌గా వ‌స్తుండ‌డం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది.