ఇదెక్క‌డి మాస్ రా మామ‌.. కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి అంపైర్ అదిరిపోయే డ్యాన్స్

ఇదెక్క‌డి మాస్ రా మామ‌.. కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి అంపైర్ అదిరిపోయే డ్యాన్స్

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన గుంటూరు కారం సినిమా మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. అయితే ఈ సినిమా మ‌హేష్ అభిమానులనే కాక ఫ్యామిలీ ఆడియన్స్‌ని సైతం ఎంత‌గానో అల‌రిస్తుంది. చిత్రంలో మ‌హేష్ బాబు స్టైలిష్ లుక్‌కి అలానే శ్రీలీల అదిరిపోయేటి డ్యాన్స్‌కి ప్ర‌తి ఒక్క‌రు మంత్ర ముగ్ధులు అవుతున్నారు. ఇక ఈ సినిమాలోని పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా కుర్చీ మ‌డ‌త పెట్టి అనే సాంగ్‌కి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రు కాలు క‌దుపుతున్నారు.

కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి మ‌న‌దేశంలోనే కాదు జ‌పాన్‌లోను చిందులు వేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా క్రికెట్ గ్రౌండ్‌లో ఓ అంపైర్ కుర్చీ మడత పెట్టి సాంగ్ హుక్ స్టెప్ వేసి అల‌రించాడు. ఫోర్ సిగ్న‌ల్ ఇచ్చాక మ‌నోడు వేసిన స్టెప్స్ ప్ర‌తి ఒక్క‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. ఈ వీడియో చాలా తమాషాగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషీ కావ‌డంతో పాటు తెగ షేర్ చేస్తున్నారు. నెటిజన్స్ ఈ వీడియో పై క్రేజీ కామెంట్స్ కూడా చేస్తున్నారు. మొత్తానికి గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడత పెట్టి సాంగ్ ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంది.

ఇప్ప‌టికే చాలా మంది సినీ సెలబ్రెటీలు, సోషల్ మీడియా స్టార్స్ కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్‌గా మారాయి. యూట్యూబ్‌లో కూడా ఈ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. థ‌మ‌న్ అద్భుత‌మైన మ్యూజిక్‌, మ‌హేష్ బాబు, శ్రీలీల సూప‌ర్బ్ డ్యాన్స్ ఈ పాట‌కి మ‌రింత హైప్ తెచ్చాయి అని చెప్పాలి. గ‌తంలో బాహుబ‌లి, పుష్ప‌లోని పాట‌ల‌కి ప్ర‌తి ఒక్క‌రు ఊగిపోగా ఇప్పుడు కుర్చీ మ‌డ‌త పెట్టి సాంగ్‌కి మంత్ర ముగ్ధులు అవుతూ తెగ చిందులేస్తున్నారు.