సంక్రాంతి వేడుక‌ల కోసం ఒకే చోట చేరిన మెగా ఫ్యామిలీ.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన క్లింకార‌, లావ‌ణ్య‌

సంక్రాంతి వేడుక‌ల కోసం ఒకే చోట చేరిన మెగా ఫ్యామిలీ.. స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మారిన క్లింకార‌, లావ‌ణ్య‌

తెలుగు రాష్ట్రాల‌లో సంక్రాంతి శోభ నెల‌కొంది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఈ పండుగ‌ని జ‌రుపుకునేందుకు అంద‌రు సొంత ఊర్ల‌కి చేరారు. ఇక సెల‌బ్రిటీలు సైతం వారి వారి ప్రాంతాల‌కి వెళ్లారు. మెగా ఫ్యామిలీ మాత్రం సంక్రాంతిని ఘ‌నంగా జ‌రుపుకునేందుకు బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ సైతం బెంగళూరు వెళ్లింది. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌ స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతూ ఫ్యాన్స్‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఉపాస‌న షేర్ చేసిన పోస్టుల్లో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కుమార్తె అర్హ, చిరు సతీమణి సురేఖ, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, ధరమ్ తేజ్.. ఇలా చాలా మంది కనిపిస్తున్నారు.

కొత్త కోడలు లావణ్య మెగా ఫ్యామిలీ సున్నుండలు చుడుతుండ‌గా, “కొత్త కోడలు మా అందరికీ సున్నుండలు చేస్తోంది… ఆమె ఎంతో స్వీట్” అంటూ లావణ్య త్రిపాఠీని ఉద్దేశించి ఉపాసన పోస్ట్ చేసింది. ఇక దీనికి “థాంక్యూ… సూపర్ స్వీట్ పెద్ద కోడలు” అంటూ లావణ్య త్రిపాఠి బదులిచ్చారు. మ‌రోవైపు ఉపాసన.. రామ్ చరణ్ వీడియోను కూడా షేర్ చేసింది. రామ్ చరణ్ దోశలు వేస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకోవ‌డంతో పాటు ఈ వీడియోకు ఓ క్రేజీ క్యాప్షన్ జోడించింది ఉపాసన. రామ్ చరణ్ దోశలు వేసే ట్రైనింగ్ అంతా తన అత్త సురేఖ ఇచ్చిందని రాసుకువచ్చింది. ఇక ఈ వీడియోల్లో తన అత్త సురేఖ కూడా దోశలు వేస్తూ కనిపించింది.

గ‌తంలో చిరంజీవి దోశ‌లు వేస్తూ సంద‌డి చేశాడు. ఇప్పుడు ఆ బాధ్య‌త‌ని రామ్ చ‌ర‌ణ్‌, ఆయ‌న త‌ల్లి సురేఖ తీసుకున్న‌ట్టుగా తెలుస్తుంది. జ‌న‌వ‌రి 13న వైష్ణ‌వ్ తేజ్ బ‌ర్త్ డే కాగా, అత‌ని బ‌ర్త్ డే వేడుకలు కూడా మెగా ఫ్యామిలీ మ‌ధ్య జ‌రిగాయి. ఇక ఈ వేడుక‌ల కోసం పవన్ క‌ళ్యాన్ కొడుకు అకీరా, కూతురు ఆద్య కూడా వ‌చ్చారు. ఇక అల్లు ఫ్యామిలీ కూడా ఇప్ప‌టికే బెంగ‌ళూరు చేరుకుంది. వీరంతా రెండు రోజుల పాటు ఫామ్ హౌజ్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌కి తిరిగి రానున్న‌ట్టు స‌మాచారం.