ఉపాసన కొణిదెల ఆస్తుల గురించి తెలిస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ కావడం ఖాయం..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రామ్ చరణ్ సతీమణి, మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న ఉపాసన ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తూనే ఉంటుంది. పలు సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు సమాజానికి సంబంధించి ఏదో మంచి పని చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది ఉపాసన. ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయిన సరే ఉపాసన ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
సోషల్ సర్వీస్, ఇటు ఫ్యామిలీ అటు వర్క్ అన్నింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉపాసన ముందుకు సాగుతుంది. ఇటీవల రామ్ చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా, ఆ చిన్నారికి క్లింకార అని నామాకరణం చేశారు. పాపని కంటికి రెప్పలా చూసుకుంటుంది ఉపాసన. అయితే రామ్ చరణ్ ఈ నెల 15 నుండి గేమ్ ఛేంజర్ షూటింగ్ కోసం నెల పాటు వైజాగ్‌లోనే ఉంటాడట. ఈ క్రమంలో తన భార్య, కూతురిని కూడా అక్కడకి తీసుకెళతాడనే టాక్ వినిపిస్తుంది. కొణెదాల వారి కోడలిగా ఉన్న ఉపాసన ఆస్తులకి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ఉపాసన పేరుపైన రూ.1,130 కోట్ల ఆస్తులు ఉంటాయని రీసెంట్ నివేదికలు చెప్పుకొస్తున్నాయి. ఉపాసన అపోలో ఆసుపత్రి బాధ్యతలు చూసుకుంటూనే చరణ్ బిజినెస్‌లని, అలానే పలు వ్యాపారాలని కూడా రన్ చేస్తుంది. ఫైనాన్షియల్‌గా ఉపాసన ఎంతో ఎత్తులో ఉందని అంటున్నారు. ఆమె తల్లిదండ్రులకి, తాతలకి కూడా ఆస్తులు భారీగానే ఉన్నాయని అందులో కొంత ఉపాసనకి దక్కుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఉపాసన త్వరలో రెండో బేబికి కూడా జన్మనివ్వబోతుందని, ఇటీవల దానికి సంబంధించి హింట్ కూడా ఇచ్చిందని నెటిజన్స్ అంటున్నారు