ఆర్సీ 16 మూవీ లాంచ్‌లో ప‌ట్టు చీర‌లో జాన్వీ కపూర్, వైట్ క్రాప్‌లో ఉపాస‌న‌.. అంద‌రి క‌ళ్లు వీరిద్ద‌రిపైనే..!

ఆర్సీ 16 మూవీ లాంచ్‌లో ప‌ట్టు చీర‌లో జాన్వీ కపూర్, వైట్ క్రాప్‌లో ఉపాస‌న‌.. అంద‌రి క‌ళ్లు వీరిద్ద‌రిపైనే..!

మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌రణ్ సినిమాల జోరు పెంచాడు. ఆయ‌న ప్ర‌స్తుతం గేమ్ ఛేంజ‌ర్ సినిమా చేస్తుండ‌గా, ఆ త‌ర్వాత త‌న 16,17వ సినిమాల‌ని శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. ఆర్సీ 16 చిత్రం బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నుండ‌గా, ఆర్సీ 17వ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న‌ట్టు టాక్. అయితే కొద్ది సేప‌టి క్రితం ఆర్సీ 16 మూవీ గ్రాండ్‌గా లాంచ్ అయింది. ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ పూజా కార్యక్రమానికి శంకర్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా వచ్చాడు. వేడుక‌లో అల్లు అరవింద్ కూడా మెరిశాడు.

రామ్ చ‌ర‌ణ్‌, త‌న భార్య ఉపాస‌న‌ని తీసుకొని ఈవెంట్‌కి వ‌చ్చారు. వైట్ క్రాప్ టాప్‌లో ఉపాస‌న ప్ర‌తి ఒక్క‌రిని ఆకర్షించింది. ఇక చిత్ర క‌థానాయిక జాన్వీ క‌పూర్ ప‌ట్టు చీర‌లో మెరిసింది. త‌నతండ్రి నిర్మాత బోనీ కపూర్ తో ఆమె ఈ ఈవెంట్‌కి వ‌చ్చింది. అయితే జాన్వీ క‌పూర్‌ని ప‌ట్టు చీర‌లో చూసిన ప్ర‌తి ఒక్కరు ఫిదా అవుతున్నారు. రామ్ చ‌ర‌ణ్‌కి స‌రిగ్గా సూట్ అయింద‌ని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్‌లో దర్శకుడు సుకుమార్‌ కూడా పాల్గొన్నారు. దర్శకుడు బుచ్చిబాబు.. సుకుమార్‌ శిష్యుడు కావ‌డంతో ఆయ‌న‌ని కూడా ఈ ఈవెంట్‌కి ఆహ్వానించారు. `ఆర్‌సీ16`కి మూవీకి ఏఆర్ రెహ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఈ ప్రారంభోత్సవంలో పాల్గొని స్పెష‌ల్ అట్రాక్ష‌న్ అయ్యారు

చాలా గ్యాప్‌ తర్వాత రెహ్మాన్‌ ఇలా తెలుగు సినిమా ఈవెంట్‌ పాల్గొనడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పూజా కార్యక్రమాల్లో ఏ ఆర్ రెహమాన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్‌లు మాట్లాడిన విజువల్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఈ మూవీలో కన్నడ శివన్న కూడా నటించబోతోన్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్స్ అయ్యాయని, రెహ‌మాన్ రెండు పాటలు కూడా కంపోజ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. పెద్ది అనే టైటిల్ మూవీకి ఫిక్స్ చేసిన‌ట్టు కూడా ప్రచారం న‌డుస్తుంది. పాన్ ఇండియా చిత్రంగా ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వ‌స్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై వెంకటసతీశ్‌ కిలారు ఈ మూవీని రూపొందిస్తున్నారు.