త‌గ్గేదే లే అంటున్న మెగా కోడ‌లు.. అత్త‌గారి బ‌ర్త్ డే రోజున కొత్త బిజినెస్ స్టార్ట్

త‌గ్గేదే లే అంటున్న మెగా కోడ‌లు.. అత్త‌గారి బ‌ర్త్ డే రోజున కొత్త బిజినెస్ స్టార్ట్

మెగా కోడ‌లు ఉపాస‌న ఏ విష‌యంలోను త‌గ్గేదే లే అంటుంది. ఒక‌వైపు అపోలో బాధ్య‌త‌లు చూసుకుంటూనే మ‌రోవైపు త‌న ఫ్యామిలీని, పాప‌ని చూసుకుంటూ బిజీబిజీగా ఉంటుంది. ఇదే స‌మ‌యంలో త‌న అత్త సురేఖ పుట్టిన రోజు సంద‌ర్భంగా కొత్త బిజినెస్ ప్రారంభించ‌బోతున్న‌ట్టు తెలియ‌జేసింది ..మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమాస్ కిచెన్’ పేరుతో కొత్త వ్యాపారం మొదలు పెట్టినట్టు తెలియ‌జేసింది. ఈ వ్యాపారం ద్వారా అత్తాకోడళ్లిద్దరూ కొణిదెల వారి వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నట్టుగా అర్ధ‌మ‌వుతుంది. త‌న‌ అత్తమ్మ వంటకాల రుచిని అందరికీ తెలిసేలా `అత్తమ్మ కిచెన్` పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ఉపాస‌న ప్రారంభించిన‌ట్టు అర్ధ‌మ‌వుతుంది.

చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌‌లోనూ రుచికరమైన భోజనం తినేలా సురేఖ ఎన్నో ర‌కాల వంట‌కాల‌ని ప్రత్యేకంగా త‌యారు చేస్తూ ఉండేది. ఇప్పుడు కొణిదెల సురేఖ వంట‌కాల‌ని అత్త‌మ్మ కిచెన్ ద్వారా అంద‌రితో పంచుకునేందుకు అత్త‌మ్త కిచెన్ ప్రారంభించిన‌ట్టు తెలుస్తుంది. ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది. బిజినెస్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఉపాస‌న ఇప్పుడు ఈ వెంచ‌ర్‌లోను త‌న ప్రావీణ్యం ఉప‌యోగించి మ‌రింత డెవ‌ల‌ప్ చేయ‌లేడంలో కీల‌క పాత్ర పోషించ‌నున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తతో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ఇది ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా “అత్తమ్మ కిచెన్”ని నిలబెట్టాలని ఉపాసన ఎంత‌గానో భావిస్తుంది. అత్త‌మ్మ కిచెన్‌లో వండిన ఒక్కో వంట‌కం రుచిని ప్ర‌తి ఒక్క‌రు అనుభ‌వించాల‌ని ఆమె ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అత్త కోడ‌ళ్లు ఇద్ద‌రు చేయ‌బోయే ఈ కొత్త ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుంది, ఎంద‌రి అభిమానాన్ని చూర‌గొంటుంది అనేది చూడాలి. కాగా, ఉపాసన పోస్ట్ చేసిన వీడియోలో ఉప్మా, పొంగల్, పులిహోర, రసం వంటి మిశ్రమాలు కనిపించాయి. ఈ మిశ్రమాలతో మన వంటింట్లో రుచికరమైన వంటలు సులభంగా త‌యారు చేసుకునే అవ‌కాశం ఉంది. అంతేకాదు ఇంటి రుచులను ఆస్వాదించిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఇప్పుడు ఈ ఉత్పత్తులను ఆన్ లైన్‌లో అందుబాటులోకి తీసుకురావ‌డం కూడా జ‌రిగింది.