Viral Video | 140 కి.మీ. వేగంతో బైక్‌ స్టంట్లు.. విరిగిన 20 ఎముక‌లు

Viral Video | 140 కి.మీ. వేగంతో బైక్‌ స్టంట్లు.. విరిగిన 20 ఎముక‌లు

Viral Video | ఓ యువ‌కుడు భ‌యంక‌ర‌మైన స్టంట్‌కు పాల్ప‌డ్డాడు. ప్రాణాల‌ను ఫ‌ణంగా పెట్టి.. ర‌ద్దీగా ఉండే ర‌హ‌దారిపై 140 కిలోమీట‌ర్ల వేగంతో దూసుకెళ్లాడు. చివ‌ర‌కు 20 ఎముక‌లు విర‌గొట్టుకున్నాడు. ముఖంపై 20 దాకా గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న అమెరికాలోని ఫ్లోరిడా హైవేపై చోటు చేసుకుంది.

ఫ్లోరిడాకు చెందిన ఓ బైక్ రైడ‌ర్.. హోండా CBR600RR బైక్‌పై రైడింగ్‌కు బ‌య‌ల్దేరాడు. ఫ్లోరిడా హైవేపై 140 కి.మీ. వేగంతో దూసుకెళ్తున్నాడు. భారీ ట్ర‌క్కులు, కార్ల మ‌ధ్య ర‌య్‌న దూసుకెళ్తూ.. స్టంట్ల‌కు పాల్ప‌డ్డారు. దాదాపు 3 నిమిషాల రైడ్ త‌ర్వాత‌.. త‌న ముందు వెళ్తున్న ఓ కారును బైక్ రైడ‌ర్ ఢీకొట్టాడు. దీంతో బైక్ అదుపుత‌ప్పి కింద‌ప‌డిపోయింది. వేగంగా దూసుకొచ్చిన ట్ర‌క్కు రైడ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో హైవే ప‌క్క‌న ప‌డిపోయాడు. ఈ దృశ్యాలు నావిగేష‌న్ కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే ఈ ప్ర‌మాదం నాలుగు నెల‌ల క్రితం చోటు చేసుకోగా, ప్ర‌స్తుతం ఆ వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డంతో, అది వైర‌ల్ అవుతోంది.

నాలుగు నెల‌ల క్రితం ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఇది నా త‌ప్పిద‌మే. అతి విశ్వాసంతో స్టంట్‌కు పాల్ప‌డ్డాను. కానీ అదృష్టవ‌శాత్తూ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాను. ముఖంపై 20 గాయాల‌య్యాయి. మోచేతి విరిగిపోయింది. ఊపిరితిత్తులు దెబ్బ‌తిన్నాయి. ప‌క్క‌టెముక‌లు విరిగిపోయాయి. వెన్నెముక డిస్క్‌లు దెబ్బ‌తిన్నాయి. మొత్తంగా 20 ఎముక‌లు విరిగిపోయాయి. త్వ‌ర‌లోనే రైడ్ చేస్తాను.. కానీ గ‌తం మాదిరి కాకుండా రైడ్‌కు వెళ్తాను అని బాధిత రైడ‌ర్ తెలిపారు.