వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఫొటోలు లీక్.. ఇందులో స్పెషల్ ఏంటంటే..!

మిస్టర్ సినిమా షూటింగ్‌లో తొలిసారి కలుసుకొని ఆ తర్వాత అంతరిక్షం చిత్రంతో దగ్గరైన ప్రేమ జంట వరుణ్ తేజ్- లావణ్య. దాదాపు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట గురించి సోషల్ మీడియాలో అనేక ప్రచారాలు జరిగిన వాటిని పూర్తిగా ఖండించారు. అయితే ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకొని పెద్ద షాకిచ్చారు. ప్రైవేట్ వేడుకగా వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ జరగగా, పెళ్లి ఎప్పుడు జరుగుతుందని కొద్ది రోజులుగా మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి తేది, రిసెప్షన్ డేట్‌కి సంబంధించి క్లారిటీ వచ్చింది. వరుణ్ తేజ్ తన ప్రేయసిని నవంబర్ 1న ఇటలీలో వివాహం చేసుకోబోతుండగా, నవంబర్ 5న వారి రిసెప్షన్ జరగునుంది. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి సందడి నెలకొంది.
ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల బ్యాచిలర్ పార్టీలు పూర్తయ్యాయి. ఇక వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్ళు వేయడమే తరువాయి. అయితే వారి పెళ్లికి సంబంధించిన పనులని ఉపాసన చూసుకుంటున్నట్టు తెలుస్తుండగా, ఆ పనులు చకచకా జరిగిపపోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటలీలో పెళ్లి పెట్టుకున్నారు కాబట్టి ఆ పెళ్లి వేడుకకి కొద్ది మంది కుటుం సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నారు.ఇక మిగతా వారందరికి హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే రిసెప్షన్‌కి ఇన్వైట్ చేస్తారు. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ లో రిసెప్షన్ వేడుక జరగనుంది. ఇప్పుడు రిసెప్షన్ కి సంబందించిన ఇన్విటేషన్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. రిసెప్షన్ ఇన్విటేషన్ ఎంతో ఆకర్షిణీయంగా ఉండడంతో పాటు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
ఇన్విటేషన్ ముందు భాగంలో వరుణ్, లావణ్య పేర్లలోని V, L అక్షరాలతో లోగో డిజైన్ చేశారు. ఇక లోపల పైభాగంలో వరుణ్ తేజ్ నానమ్మ అంజనాదేవి, తాతయ్య కొణిదెల వెంకట్రావు ఆశీస్సులతో అని రాయగా, ఆ తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రం అంటూ.. చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ పేర్లని హైలైట్ చేస్తూ ముద్రించారు.ఇక రిసెప్షన్ ఇన్విటేషన్ గెస్ట్ లకు అవసరమైన కార్ పాస్ లని కూడా పొందుపరచి వాటిని సన్నిహితులకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి, రిసెప్షన్ దుస్తులు, స్టైలింగ్ ఫైనల్ చేసేందుకు బాలీవుడ్ నుంచి స్టార్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రానున్నట్లు ఓ టాక్ నడుస్తుంది. నిహారిక విడాకులు ప్రకటించిన కొద్ది నెలలకి వరుణ్ పెళ్లి చేసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.