భారీగా పొట్ట పెంచుతున్న మెగా హీరో.. ఇదేదో కాస్త తేడాగా ఉందే..!

మెగా ఫ్యామిలీ హీరోలు వరుస సినిమాలతో ప్రేక్షకులకి పసందైన వినోదం పంచుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. చిరంజీవి నుండి మొదలు వరుణ్ తేజ్ వరకు వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. అయితే మెగా ఫ్యామిలీలో అందరు హీరోలు అడపాదడపా హిట్స్ కొడుతున్నా కూడా వరుణ్ తేజ్ మాత్రం ఈ మధ్య పెద్దగా హిట్స్ అందుకోవడం లేదు.చివరిగా ఆపరేషన్ వాలంటైన్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది. అయితే ఇందులో వరుణ్ తేజ్ నటనకి మంచి మార్కులు అయితే పడ్డాయి. ప్రస్తుతం వరుణ్ కరుణకుమార్ దర్శకత్వంలో ‘మట్కాస అనే సినిమా చేస్తున్నాడు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా, 1960 బ్యాక్‌డ్రాప్‌తో, గ్యాంబ్లింగ్ తరహా కథాంశంతో మట్కా చిత్రం రూపొందుతుందని ఓ టాక్ నడుస్తుంది.ఇప్పటికే మట్కా నుండి చిన్న గ్లింప్స్ విడుదల చేయగా, ఇది సినిమాపై అంచనాలు భారీగానే పెంచింది. చిత్రంలో వరుణ్ తేజ్ మూడు పాత్రలలో కనిపించనున్నాడని టాక్. 20 ఏళ్ల కుర్రాడిలా, 50 ఏళ్ల వయస్సు ఉన్న ఓ పాత్రలో వరుణ్ తేజ్ కనిపించి సందడి చేయనున్నాడనే టాక్ బలంగా వినిపిస్తుంది. మరోవైపు 30 ఏళ్ళు పైబడిన వ్యక్తిగా కూడా వరుణ్ కనిపించనున్నాడని అంటున్నారు.
అయితే ఈ పాత్రల కోసం వరుణ్ తేజ్ తన బాడీని మార్చుకుంటున్నట్టు సమాచారం. 50 ఏళ్ళ పాత్ర కోసం సహజంగా పొట్ట పెంచుతున్నాడట వరుణ్ తేజ్. కొంచెం లావు అయి, కొంచెం పొట్ట పెంచుకొని పెద్ద మనిషిగా కనిపించనున్నాడట మెగా హీరో. ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు ప్రతి చిత్రంతోను ప్రయోగాలు చేస్తూ వచ్చాడు. మూవీ సక్సెస్ అందించకపోయిన కూడా ప్రయోగాలు చేయడం ఆపలేదు. గద్దలకొండ గణేష్ సినిమాకు అయితే బాగా బాడీ, గడ్డం పెంచి రఫ్ లుక్‌లో కనిపించాడు. ఇప్పుడు మట్కా సినిమా కోసం విచిత్రమైన లుక్‌లో కనిపించనున్నాడట. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది చూడాలి. చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో కనిపించి సందడి చేయనున్నారు