ఈ ఏడాది విడిపోయే జంటలు వీరే.. వేణు స్వామి జోస్యంతో అభిమానుల్లో టెన్షన్

సమంత, నాగ చైతన్య విడాకుల విషయం చెప్పి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. ఈయన చెప్పిన వాటిలో కొన్ని జరిగేవి. కొన్ని జరిగేవి కావు. ప్రముఖుల కెరీర్, వ్యక్తిగత జీవితాలపై జ్యోతిష్యం చెప్పడం ద్వారా పాపులర్ అయ్యాడు. వివాదాస్పద జ్యోతిష్కుడిగా ఖ్యాతిని పొందాడు. జాతకం పేరుతో ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, అఖిల్, విజయ్ దేవరకొండ, ఇంకా చాలా మంది టాలీవుడ్ సెలబ్రిటీలపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తలలో నిలిచాడు.ఇక టాలీవుడ్ స్టార్స్ కూడా తన క్లయింట్లుగా ఉన్నారు. రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయాతి వంటి హీరోయిన్లు తమ కెరీర్లో ఎదగాలని పూజలు చేయడం మనం చేశాం. ఇక ఇదిలా ఉంటే కొత్త సంవత్సరంలో వేణు స్వామి ప్రముఖుల గురించి జోస్యం చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ ఏడాది ఎవరెవరు విడిపోతారు అనే విషయం గురించి వేణు స్వామి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. గతంలోనే రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా విడాకులు అవుతాయని స్పష్టం చేసిన వేణు స్వామి.. కొత్త జంట వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లు కూడా ఒక మహిళ కారణంగా విడాకులు తీసుకుంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మూడు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడో భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇప్పుడు ఆమెకి కూడా విడాకులు ఇస్తారని, అంతేకాదు నాలుగో పెళ్లి చేసుకుంటారంటూ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ కి పెళ్లి జరిగితే ఈ ఏడాది లోనే జరగాలి.ఒకవేళ జరిగినా కూడా ఈయనకు కచ్చితంగా విడాకులు తప్పవు అని వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్‌కి ఉన్న ఆరోగ్య సమస్యల కారణంగా పెళ్లి జరిగే అవకాశం లేదు. బ్రహ్మచారిగా మిగిలిపోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చారు. సమంత, నాగ చైతన్య విషయంలో ఈయన చెప్పింది చెప్పినట్టు జరగడంతో ఇలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడంటూ వేణు స్వామి జోస్యాన్ని కొందరు ఖండిస్తున్నారు. నీ నోరు ఎప్పుడు శుభాలు పలకదా.. ఎప్పుడు అశుభాలే పలుకుతుందా అంటూ తిట్టిపోస్తున్నారు. వేణు స్వామి కొద్ది రోజుల క్రితం తెలంగాణ లో మళ్లీ బీఆర్ఎస్ వస్తుందని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. కాని అలా జరగకపోవడంతో ఓ రేంజ్లో వేణు స్వామిని నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.