విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక.. నిశ్చితార్థం త్వరలోనే?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక.. నిశ్చితార్థం త్వరలోనే?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ పెయిర్‌గా సినీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక‌. వీరిద్ద‌రు క‌లిసి గీత గోవిందం అనే చిత్రంలో న‌టించారు. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో పాటు వీరిద్ద‌రు మంచి ఫ్రెండ్స్‌గా మారేలా చేసింది. ఇక గీతా గోవిందం హిట్ త‌ర్వాత ఈ కాంబినేషన్‌లో డియర్ కామ్రెడ్ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఈ ఇద్దరి మధ్య బాండింగ్ మాత్రం తగ్గలేదు. రష్మిక దాదాపుగా ప్రతి పండుగకు విజయ్ ఇంటికి వస్తుందని, హైద‌రాబాద్ వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా విజ‌య్ ఇంటికి త‌ప్ప‌క వెళుతుంద‌ని కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఆ మ‌ధ్య వెకేషన్ కోసం ఈ ఇద్ద‌రు మాల్దీవ్స్‌కు వెళ్లినట్లు రూమర్స్ వినిపించాయి.

ఇక త్వ‌ర‌లోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు ప్ర‌చారాలు సాగ‌గా, ఇప్పుడు అవి నిజం అయ్యేలా క‌నిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్విట్టర్లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నా పెళ్లికి సంబంధించిన ఒక న్యూస్ వైర‌లో అయింది… విజయ్ దేవరకొండ రష్మిక మదన్నా ల పెళ్లి ఫిక్స్ అయిందట. ఈ ఏడాది ఈ జంట పెళ్లి పీటలెక్కబోతున్నట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఫిబ్ర‌వ‌రిలో ఈ ఇద్ద‌రు నిశ్చితార్థం జ‌రుపుకోనున్న‌ట్టు త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఇరు కుటుంబ స‌భ్యులు ఓకే చెప్ప‌డంతో ఈ జంట పెళ్లి పీట‌లెక్కేందుకు రెడీ అయ్యార‌ని తెలుస్తుంది.

ఈ జంట ఇప్పటికే ఎన్నోసార్లు మీడియాకి, వారి అభిమానులకి అడ్డంగా దొరికిపోయారు. కాని ప్ర‌తి సారి ఏదో కార‌ణం చెప్పి త‌ప్పించుకుంటున్నారు. కాని ఈ సారి మాత్రం ఓ మంచి రోజు చూసుకుని ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమాన్ని జ‌రుపుకోనున్నార‌ని తెలుస్తోంది. కాగా, ర‌ష్మిక‌కి ఇప్ప‌టికే నిశ్చితార్థం జ‌రిగి క్యాన్సిల్ అయింది. ఇప్పుడు విజ‌య్ తో మ‌రోసారి నిశ్చితార్థం జ‌రుపుకోబోతుంది. అయితే విజ‌య్, ర‌ష్మిక పెళ్లి చేసుకుంటే అది పెటాకులు అవుతుంది అని ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి హెచ్చ‌రిస్తున్నారు. అయిన వీరు పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో.విజయ్ దేవరకొండ ఇటీవల ఖుషి అనే సినిమా చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సమంత హీరోయిన్‌గా చేసింది. భారీ అంచనాలు నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 1న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇక ర‌ష్మిక యానిమ‌ల్‌లో న‌టించి మంచి హిట్ అందుకున్న విష‌యం తెలిసిందే. ఇక పుష్ప‌2 చిత్రంతోను బిజీగా ఉంది రష్మిక‌.