తొలి రెండు టెస్ట్‌లు విరాట్ కోహ్లీ ఆడ‌క‌పోవ‌డానికి ఇదా కార‌ణం.. !

తొలి రెండు టెస్ట్‌లు విరాట్ కోహ్లీ ఆడ‌క‌పోవ‌డానికి ఇదా కార‌ణం.. !

ఈ ఏడాది మంచి విజ‌యాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న టీమిండియా హైద‌రాబాద్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన తొలి టెస్ట్‌లో ఓట‌మి పాలైంది. గెల‌వాల్సిన మ్యాచ్‌లో చేజాతులారా వికెట్లు చేజార్చుకొని 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ విరాట్ లేకుండా ఆడింది టీమిండియా . కోహ్లీ ఉంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేద‌ని చెప్పుకొస్తున్నారు. అస‌లు కోహ్లీ మొద‌టి రెండు టెస్ట్‌లుకి ఎందుకు గైర్హాజ‌రు అయ్యాడు, అందుకు కార‌ణాలు ఏంట‌నే దానిపై అనేక ఊహ‌గానాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వ‌స్తున్న స‌మాచారం మేర‌కు విరాట్ కోహ్లీ తన పేరును ఉపసంహరించుకోవడానికి అనుష్క శర్మ కారణమంటూ ప్ర‌చారం న‌డుస్తుంది.

అనుష్క శర్మ కారణంగానే విరాట్ కోహ్లీ జ‌ట్టు నుండి త‌ప్పుకున్నాడ‌ని, మూడో టెస్ట్ నుండి అత‌ను అందుబాటులో ఉంటాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లీ అనారోగ్యంతో ఉన్నారని , అందుకే, ఈ ఆటగాడు అతని పేరును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నాడ‌ని ఇంకో ప్ర‌చారం న‌డిచింది.ఈ క్ర‌మంలో విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ స్పందించాడు. తమ తల్లి పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని, సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్న వార్తలను నమ్మవద్దని ఫ్యాన్స్‌ను కోరాడు వికాస్ కోహ్లీ. నిజనిజాలు తెలియకుండా దయచేసి తప్పుడు వార్తలు ప్రసారం చేయవద్దు అని వికాస్ కోహ్లీ కోరాడు. కాగా విరాట్ కోహ్లీ తల్లిదండ్రుల పేర్లు సరోజ్-ప్రేమ్ కోహ్లీ కాగా, వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. వారి పేర్లు విరాట్ కోహ్లీ, అతడి సోదరి కోహ్లీ ధింగ్రా, అన్న పేరు వికాస్ కోహ్లీ.

ఇక వికాస్ కోహ్లీ స్పందన పట్ల అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తూ.. కోహ్లీ తిరిగి టీంలోకి రావాల‌ని ఫ్యాన్స్ కోరుతున్నారు. రెండో టెస్ట్ ఫిబ్ర‌వ‌రి 2 నుండి వైజాగ్‌లో జ‌ర‌గ‌నుండ‌గా, ఆ టెస్ట్‌కి కోహ్లీ అందుబాటులో ఉండ‌డు. ఇంగ్లాండ్‌తో 3, 4, 5 టెస్టులకు కోహ్లీ అందుబాటులోకి వస్తాడని.. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడుతాడని అభిమానులు భావిస్తున్నారు. ఇక కోహ్లీ ప్ర‌స్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆయ‌న తిరిగి జ‌ట్టులో చేరితే టీమిండియా బ‌లం మ‌రింత పెర‌గడం ఖాయం.