మెగాస్టార్ చిరు నుండి బాలయ్య వరకు ఇండస్ట్రీలో రిచ్ హీరో ఇతనే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రజంట్ ఉన్న హీరోలు ఒకే తరానికి చెందిన వాళ్లు. ఈ యంగ్ జనరేషన్ తో పాటు 60 ఏళ్లు దాటిన వాళ్లు ఇంకా తమ టాలెంట్ తో రాణిస్తూన్నారు. అలాంటి హీరోలు ఇండస్ట్రీలో కూడా రిచెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. మరి వారెవరో ఇప్పుడు చూద్దాం. ఏఎన్ఆర్ నటవారసుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ తెచ్చుకుని ఇప్పటికీ కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తూ ముందుకు వెళ్తున్నారు నాగార్జున. టాలీవుడ్ మన్మధుడిగా తన కంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. సినిమాలే కాదు ఎన్నో బిజినెస్ లోనూ తన ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుకుని మంచి బిజినెస్ మెన్ గా కూడా ఎదిగారు. తనకు నాన్న నుండి వచ్చిన ఆస్తితో పాటు తన సొంత ఆస్తి కూడా కలిపి 13 వేల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది.
నెక్ట్స్ దగ్గుబాటి రామానాయుడి వారసుడు విక్టరీ వెంకటేష్. విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకుని చేసిన సినిమాలన్నీ హిట్ లు కొట్టి తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ ఆయన వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ తో దూసుకుపోతున్నారు. ఆయన ఆస్తులతో పాటు ఆయన సంపాదించుకున్న ఆస్తులు అన్నీ కలిపి దాదాపు 6000కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తుంది. నెక్ట్స్ మెగాస్టార్ చిరంజీవి. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకున్నా స్వశక్తితో కష్టపడి వచ్చిన సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టార్ డమ్ ను తెచ్చుకుని వేలాది మంది ప్రేక్షకుల్ని అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు చిరంజీవి.
ఆయన ఇప్పటికీ హీరోగా సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతున్నారు. ఆయన స్వశక్తితో కష్టపడి సంపాదించిన ఆస్తులు 8000 కోట్లకు పైగానే ఉంటుంది. నెక్ట్స్ నందమూరి తారకరామారావు నటవారసత్వంతో ఎదిగిన స్టార్ నటుడు బాలయ్య. తాను కూడా ఎన్నో బిజినెస్ లలో సంపాదించారు. ఇప్పటికీ హీరోగా కంటిన్యూ అవుతున్నారు. తండ్రి ఆస్తులతో పాటు బాలకృష్ణ ఆస్తులు కూడా కలిపి దాదాపు 4000 కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తుంది.