ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ ఆయన.. అతని జీవితం ఎందరికో ఆదర్శం..
ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ ఈయన. కేవలం 3 ఫీట్ల ఎత్తు మాత్రమే ఉన్నాడు అతను. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అతను.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఓ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.

ప్రపంచంలోనే అత్యంత పొట్టి డాక్టర్ ఈయన. కేవలం 3 ఫీట్ల ఎత్తు మాత్రమే ఉన్నాడు అతను. ఇటీవల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అతను.. గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఓ హాస్పిటల్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతనికి మొదట్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశం కల్పించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంగీకరించలేదు. సుప్రీంకోర్టు తీర్పుతో అతనికి ఎంబీబీఎస్ కోర్సులో సీటు లభించింది.
నా పేరు గణేశ్ బరైయా.. వయసు 23 ఏండ్లు. కేవలం 3 ఫీట్ల ఎత్తు మాత్రమే ఉంటాను. మెడికల్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీటు సాధించాను. కానీ మెడికల్ కాలేజీలో ప్రవేశం లభించలేదు. ఎత్తు కారణంగా తనకు సీటు ఇవ్వలేకపోతున్నామని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఎమర్జెన్సీ కేసులకు ట్రీట్‌మెంట్ చేయడం కష్టమని ఎంసీఐ తెలిపింది. దీంతో నా గురువుల సూచనల మేరకు మొదట గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాను. అక్కడ్నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లాను. చాలా కాలం న్యాయ పోరాటం చేసిన తర్వాత.. సుప్రీంకోర్టు తీర్పుతో తనకు ఎంబీబీఎస్ సీటు లభించింది. అప్పుడు ఎవరూ తనను ఆపలేకపోయారు. 2019లో ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం పొందాను. భావ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఇటీవలే ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి పట్టా అందుకున్నాను. ప్రస్తుతం భావ్‌నగర్‌లోని సర్ – టీ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నానని గణేశ్ తెలిపారు.
గణేశ్ రైతు బిడ్డ..
డాక్టర్ గణేశ్ రైతు బిడ్డ. ఒక వ్యవసాయ కుటుంబం నుంచి గణేశ్.. అనేక అవమానాలు ఎదుర్కొని ఎంబీబీఎస్ విద్య పూర్తి చేశారని మెడికల్ కాలేజీ డీన్ డాక్టర్ హేమంత్ మెహతా పేర్కొన్నారు. ఇప్పుడు అతను ఇంటర్న్‌షిప్ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇక అతనికి స్నేహితులు ఎంతో హెల్ప్ చేశారని పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి డాక్టర్ గణేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.