కాలి బొటన వేలి పక్కన ఉండే వేలు.. చాలా మందిలో పెద్దదిగా ఉంటుంది. ఆ వేలు పెద్దదిగా ఉంటే అదృష్టవంతులని, ధనవంతులని చాలా మంది నమ్ముతుంటారు.
మానవ జన్మలో దాదాపు అందరూ ఒకే శరీరాకృతిని కలిగి ఉంటారు. రంగు, ఎత్తులో తేడా ఉంటుంది తప్ప అన్ని శరీర భాగాలు ఒకేలా ఉంటాయి. అయితే కొన్ని శరీర భాగాల విషయానికి వస్తే.. కొందరికి కొన్ని అవయవాలు ప్రత్యేకంగా ఉంటాయి. మరి ముఖ్యంగా ఏంటంటే.. కాలి బొటన వేలి పక్కన ఉండే వేలు.. చాలా మందిలో పెద్దదిగా ఉంటుంది. ఆ వేలు పెద్దదిగా ఉంటే అదృష్టవంతులని, ధనవంతులని చాలా మంది నమ్ముతుంటారు. ఇక అలాంటి వారిపై తమ భార్యలు అజమాయిషీ చేస్తారని చాలా మంది విశ్వసిస్తుంటారు. అసలు ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలుసుకుందాం..
ఇలా కాలి బొటన వేలి కన్నా దాని పక్కన ఉండే వేలు పొడవుగా ఉంటే దాన్ని వైద్య పరిభాషలో మిటెన్ ఫుట్(Morton’s toe) అని పిలుస్తారు. 1884 నుంచి 1960 వరకు జీవించిన అమెరికన్ ఆర్థోపెడిక్ సర్జన్, ఫుట్ అనాటమిస్ట్ డడ్లీ జాయ్ మోర్టన్ పేరు మీదుగా అలాంటి స్థితికి మోర్టన్స్ టో అని పేరు పెట్టారు. ఆయన ఇలాంటి స్థితిని గుర్తించారు. కనుక ఆయన పేరు మీదుగా ఆ పేరు పెట్టారు.
అయితే ఇది జన్యు సంబంధ కారణాల వల్లే ఎక్కువగా వస్తుందని.. అంతేకానీ.. ఇందులో మూఢ నమ్మకాలు ఏవీ ఉండవని సైంటిస్టులు అంటున్నారు. కాలి బొటన వేలి కన్నా దాని పక్క వేలు పొడవుగా ఉంటే అదృష్టవంతులు, ధనవంతులు అవుతారనేది ఊహా మాత్రమే. మహిళలు తమ భర్తలపై అజమాయిషీ చేస్తారని అనడంలో అర్థం లేదని.. ఇది ఎంత మాత్రం నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇవి కేవలం మూఢ విశ్వాసాలే అని అంటున్నారు.