AP, Telangana BJP Presidents| ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుల ఎన్నిక ఏకగ్రీవం

విధాత: తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల బీజేపీ అధ్యక్షుల ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిశాయి. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పోకల వంశీ నాగేంద్ర మాధవ్(పీవీఎన్ మాధవ్) ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను దృవీకరిస్తూ ఏపీ ఎన్నికల ఇంచార్జి పీసీ మోహన్ దృవపత్రం అందించారు. మాధవ్ తండ్రి చలపతిరావు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించారు. ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మాధవ్ ను ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.
ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన ఎన్నికకు సంబంధించిన దృవీకరణ పత్రాన్ని అందించారు. రామచంద్రారావు ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగుతారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావును కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ సహా పార్టీ నేతలు అభినందనలు తెలిపారు.