డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడికి గాయాలు
సింగపూర్ లో చదువుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి.

Deputy CM Pawan Kalyan:
విధాత : సింగపూర్ లో చదువుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి. సింగపూర్ రివర్ వాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ సహా 14మంది చిన్నారులకు గాయాలయ్యాయి. నలుగురు పెద్ద వాళ్లకు కూడా గాయాలైనట్లుగా సమాచారం. పవన్ కుమారుడు ఎనిమిదేళ్ల మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఊపిరి తిత్తులలో పొగ వెళ్లడంతో కొంత అస్వస్థతకు గురయ్యడు. మార్క్ శంకర్ సహా గాయపడిన వారందరిని రెస్క్యూ టీమ్ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిచెన్ పాఠాలు బోధించే స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రితో చికిత్స పొందుతున్న వారిలో ఒకరు మృతి చెందారు.
ప్రస్తుతం అల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన పూర్తికాగానే వెంటనే సింగపూర్ కు బయలుదేరనున్నారు.
అబ్బాయి బాగానే ఉన్నాడు : చిరంజీవి
తన సోదరుడు పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. బాబు కాళ్లకు స్వల్పంగా గాయాలు అయ్యాయని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స అందుతోందని..ఆందోళన చెందనవసరం లేదన్నారు.