Amazon Summer Sale | అమెజాన్‌ ‘గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌’ వచ్చేసింది..! మొబైల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఇవ్వబోతున్న ఈ కామర్స్‌ సంస్థ..!

Amazon Summer Sale | ఆన్‌లైన్‌లో సమ్మర్‌ సేల్స్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ శుభవార్త చెప్పింది. అమెజాన్‌ ‘గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల అంటే మే 2 నుంచి సమ్మర్‌ సేల్‌ మొదలవనున్నట్లు ప్రకటించింది. అయితే, ఎప్పటి వరకు ముగుస్తుందో మాత్రం చెప్పలేదు. స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఇతర వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది.

Amazon Summer Sale | అమెజాన్‌ ‘గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌’ వచ్చేసింది..! మొబైల్స్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్‌ ఇవ్వబోతున్న ఈ కామర్స్‌ సంస్థ..!

Amazon Summer Sale | ఆన్‌లైన్‌లో సమ్మర్‌ సేల్స్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ శుభవార్త చెప్పింది. అమెజాన్‌ ‘గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌’ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల అంటే మే 2 నుంచి సమ్మర్‌ సేల్‌ మొదలవనున్నట్లు ప్రకటించింది. అయితే, ఎప్పటి వరకు ముగుస్తుందో మాత్రం చెప్పలేదు. స్మార్ట్‌ఫోన్స్‌తో పాటు ఇతర వస్తువుల కొనుగోలుపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ని ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ‘బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్’ అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఫోన్ల జాబితాను ప్రకటించింది. అమెజాన్‌ ముఖ్యంగా 8 వన్‌ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించబోతున్నది. అలాగే వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4, వన్‌ప్లస్‌ 12 ఆర్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ 3 తదితర మొబైల్స్‌పై డిస్కౌంట్‌ని ప్రకటించింది.

రెడ్‌మీ 13సీ, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం 34, షావోమీ 14, శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌ 23, ఐక్యూ జెడ్‌ 9, గెలాక్సీ ఎస్‌ 24, టెక్నో పోవా 6 ప్రో తదితర మోడల్స్‌పై సైతం డిస్కౌంట్‌ని ప్రకటించింది. ఈ ఫోన్లపై ఎంత డిస్కౌంట్‌ ఇవ్వనుందో మే 2న తెలియనున్నది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌పై సైతం డిస్కౌంట్స్‌ని అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక ఆపిల్‌ ఫోన్లపై సైతం డిస్కౌంట్‌ ఇవ్వనున్నది. అయితే, ఏయే మోడల్స్‌పై డిస్కౌంట్‌ ఇవ్వనుందో తెలియాల్సి ఉంది. సేల్ ఈవెంట్‌లో యాపిల్ డివైజెస్‌ సైతం ఉంటాయని టీజర్‌లో పేర్కొంది.

ఇక అమెజాన్ తన ప్రైమ్‌ మెంబర్స్‌కి మే ఒకటి అర్ధరాత్రి 12 గంటల నుంచే అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డులపై 10శాతం డిస్కౌంట్‌ ఉంటుందని వివరించింది. సేల్‌ సమయంలో వినియోగదారులు చేసే మొదటి ఆర్డర్‌ని ఫ్రీగా డెలివరీ చేస్తామని.. వెల్‌కమ్‌ రివార్డ్‌ పేరుతో 20శాతం క్యాష్‌ బ్యాక్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. పలు రకాల ఉత్పత్తుల శాంపిల్స్‌ను కేవలం రూపాయికే అందించనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ‘ట్రై బిఫోర్ యు బై @ 1’ పేరుతో ఈ ఆఫర్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆఫర్‌పై అందించే ఉత్పత్తులను ముందే బుక్ చేసుకునేందుకు ‘ప్రీ బుక్’ అవకాశం అందుబాటులో ఉందని పేర్కొంది.