Axis Finance: యాక్సిస్ ఫైనాన్స్.. దిశా హోమ్ లోన్స్! వారికి రుణాలు

ముంబై: ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థ యాక్సిస్ ఫైనాన్స్ అక్షయ తృతీయ సందర్భంగా దిశా హోమ్ లోన్స్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా నిస్సహాయ వర్గాలు (EWS), తక్కువ ఆదాయ వర్గాల (LIG) గృహ కొనుగోలు కలలను సాకారం చేయడానికి ఈ రుణాలు రూపొందించామని సంస్థ తెలిపింది.
ఈ అవసరాలున్న వారు రుణం పొందొచ్చు…
సిద్ధంగా ఉన్న, నిర్మాణంలో ఉన్న, రీసేల్ ఆస్తుల కొనుగోలు.
ప్లాట్ కొనుగోలు, నిర్మాణం.
గృహ నవీకరణ, విస్తరణ.
ఈ సందర్భంగా యాక్సిస్ ఫైనాన్స్ ఎండీ & సీఈవో సాయి గిరిధర్ మాట్లాడుతూ.. “అక్షయ తృతీయ సందర్భంగా దిశా హోమ్ లోన్స్‌ను ప్రారంభించడం గృహ కొనుగోలును సులభతరం చేయాలన్న మా లక్ష్యాన్ని సూచిస్తుంది. ఇవి ఆర్థికంగా నిస్సహాయ వర్గాల ఇంటి కలను సాకారం చేయడానికి ఆర్థిక అంతరాలను తొలగించడంలో ఈ రుణాలు సహాయపడతాయి. ప్రభుత్వ గృహ ఫైనాన్స్ లక్ష్యాలకు అనుగుణంగా, వివిధ ప్రాంతాల కస్టమర్లకు అనుకూలీకరించిన సొల్యూషన్స్ అందిస్తాం. పారదర్శక సేవలు, అత్యుత్తమ అనుభవంతో కస్టమర్లకు ఉన్నతమైన సొల్యూషన్స్ అందించడం మా లక్ష్యం. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ, టెక్నాలజీ, డేటా సైన్స్ మా కార్యకలాపాలకు పునాదిగా నిలుస్తాయి. గృహ ఫైనాన్స్‌ను సులభంగా, నిరాటంకంగా అందించడంపై మా దృష్టి ఉంది” అని పేర్కొన్నారు.
ముథూట్ ఫిన్‌కార్ప్ ఎన్‌సీడీ సిరీస్ V ప్రారంభం….
ముంబై: ముథూట్ ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (ఎంఎఫ్ఎల్) సెక్యూర్డ్, రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్ల (ఎన్‌సీడీ) V విడతను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. 2025 ఏప్రిల్ 29 నుంచి జారీ ప్రారంభమవుతుంది. ఒక్కో డిబెంచర్ ముఖ విలువ రూ. 1,000గా ఉంటుంది.
నిధుల వినియోగం: లెండింగ్, ఫైనాన్సింగ్ కార్యకలాపాలు, రుణ వడ్డీ, అసలు చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగం.
సమీకరణ లక్ష్యం: రూ. 2,000 కోట్ల షెల్ఫ్ లిమిట్‌లో రూ. 350 కోట్ల సమీకరణ.
రాబడి: 24, 36, 60, 72 నెలల కాలవ్యవధిలో 9.00% నుంచి 10.00% వార్షిక రాబడి.
రూ. 100 కోట్ల బేస్ సైజుతో, రూ. 250 కోట్ల గ్రీన్ షూ ఆప్షన్‌తో కలిపి ఈ ఇష్యూ మొత్తం రూ. 350 కోట్లుగా ఉంటుంది. 2025 ఏప్రిల్ 29 నుంచి మే 13 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు అందుబాటులో ఉంటుంది. డైరెక్టర్ల బోర్డు లేదా స్టాక్ అలాట్‌మెంట్ కమిటీ ఆమోదంతో, సెబీ ఎన్‌సీఎస్ నిబంధనలకు అనుగుణంగా ముందుగా ముగించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ముథూట్ ఫిన్‌కార్ప్ సీఈవో షాజీ వర్గీస్ మాట్లాడుతూ… “సురక్షిత, అధిక రాబడి అందించే పెట్టుబడి అవకాశంగా కొత్త ఎన్‌సీడీ సిరీస్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరం. మా 3,700 శాఖలు, ముథూట్ ఫిన్‌కార్ప్ వన్ యాప్, భాగస్వామ్య నెట్‌వర్క్ ద్వారా రూ. 5 లక్షల వరకు పెట్టుబడులు సులభంగా చేయవచ్చు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వినూత్న ఆర్థిక సాధనాలను అందించే మా నిబద్ధతకు ఈ ఎన్‌సీడీ నిదర్శనం” అని పేర్కొన్నారు.