Equity Markets: వేల్యూ ఇన్వెస్టింగ్.. మార్కెట్ అలజడిలో స్థిరమైన లాభాల ఎంపిక

Equity Markets: వేల్యూ ఇన్వెస్టింగ్.. మార్కెట్ అలజడిలో స్థిరమైన లాభాల ఎంపిక

Equity Markets: వేల్యూ ఇన్వెస్టింగ్.. మార్కెట్ అలజడిలో స్థిరమైన లాభాల ఎంపిక

హైదరాబాద్: భారతీయ ఈక్విటీ మార్కెట్ ఆశావహ దశలో ఉన్నప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాల ప్రభావం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఆకర్షణీయమైన P/E నిష్పత్తి, బలమైన ఫండమెంటల్స్‌తో కూడిన వేల్యూ-ఆధారిత ఈక్విటీ ఫండ్స్ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా ఉద్భవిస్తున్నట్లు సంస్థ చెబుతోంది.

FY25 చివరి త్రైమాసికంలో అనేక కంపెనీలు గణనీయమైన ఆదాయ వృద్ధి సాధించినప్పటికీ, మిడ్ మరియు స్మాల్ క్యాప్ షేర్ల వేల్యుయేషన్లు దీర్ఘకాలిక సగటుల కంటే ఎక్కువగా ఉన్నాయి. దీంతో, లార్జ్ క్యాప్ షేర్లు రిస్కు-రివార్డు సమతౌల్యతను అందించే అవకాశం ఉంది. నాణ్యత, మార్జిన్ ధోరణుల ఆధారంగా స్టాక్ ఎంపిక కీలకంగా మారనుంది.

వేల్యూ ఫండ్స్, తమ అంతర్గత విలువ కంటే తక్కువ ధరలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాయి. స్థిరమైన ఆదాయాలు, బలమైన క్యాష్ ఫ్లో, నిలకడైన పనితీరుతో దీర్ఘకాలిక రీ-రేటింగ్ అవకాశం ఉన్న కంపెనీలను ఫండ్ మేనేజర్లు ఎంచుకుంటారు.

“టారిఫ్‌ల కఠినతర పరిస్థితుల్లో ఫైనాన్షియల్స్, యుటిలిటీస్, ఎనర్జీ, సిమెంట్, డిఫెన్సివ్ ఎఫ్‌ఎంసీజీ వంటి దేశీయ రంగాలు స్థిరమైన ఫలితాలు ఇవ్వగలవు,” అని టాటా అసెట్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్ సోనమ్ ఉదాసీ వెల్లడించారు.

గత ఏడాదిగా వేల్యూ ఇన్వెస్టింగ్ భారత మార్కెట్లో బలమైన పనితీరు కనబర్చింది. వేల్యూ ఫండ్స్ ఆస్తుల పరిమాణం (AUM) గణనీయంగా పెరిగింది. ఉదాహరణకు, టాటా ఈక్విటీ P/E ఫండ్ AUM 2025 మార్చి నాటికి రూ. 8,004 కోట్లకు చేరగా, FY25లో రూ. 884 కోట్ల నికర ప్రవాహం నమోదైంది, ఇది FY24 కంటే 83% అధికం.

టాటా ఈక్విటీ P/E ఫండ్ 3 ఏళ్లలో 19.2% రాబడిని అందించి, నిఫ్టీ 500 TRI (13.9%), నిఫ్టీ 50 TRI (11.8%)లను అధిగమించింది. గత 5 ఏళ్లలో నెలవారీ రూ.10,000 SIP రూ. 9.2 లక్షలకు చేరింది.

ఈ ఫండ్ కనీసం 70% నికర ఆస్తులను BSE సెన్సెక్స్ కంటే తక్కువ P/E గల కంపెనీలలో పెట్టుబడి చేస్తుంది, వేల్యుయేషన్, కంపెనీ సామర్థ్యాల ఆధారంగా డైనమిక్‌గా కేటాయింపులు సర్దుబాటు చేస్తుంది.

దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు, ముఖ్యంగా 3 ఏళ్లకు పైగా వ్యవధి గలవారికి, వేల్యూ ఫండ్స్ క్రమశిక్షణతో కూడిన, రిస్కును సమతుల్యం చేసే వృద్ధి అవకాశాలను అందిస్తాయి.