పసడి ప్రియులకు ఊరట..! నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

విధాత: బంగారం ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. గత నాలుగైదు రోజులు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గురువారం స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల తులం బంగారం రూ.53,800 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,530 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.53,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,680 వద్ద కొనసాగుతున్నది.
చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.53,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.58,690 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.58,530 వద్ద ట్రేడవుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.58,530 వద్ద స్థిరంగా ఉన్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.53,650 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.58,530 పలుకుతున్నది. మరో వైపు వెండి ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. కిలోకు రూ.500 దిగి రాగా.. కిలోకు రూ.72,600కి దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రూ.75వేలకు తగ్గింది.