బంగారం కొనాలనుకునేవారికి అదిరిపోయేవార్త..! బంగారం ధర ఎంత తగ్గిందంటే..?

విధాత: బంగారం కొనుగోలు చేయాలనే వారికి అదిరిపోయే వార్త. మొన్నటి వరు భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన పసడి ధరలు మరోసారి దిగజారాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, అమెరికా డాలర్ పుంజుకోవడంతో బంగారం ధరలు పతనమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పండగల సీజన్ కొనసాగుతుండడంతో బంగారాన్ని డిమాండ్ పెరుగుతున్నది.
బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధరలు స్వల్పంగా పడిపోయాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.150 వరకు తగ్గి రూ.54,950కి దిగివచ్చింది. 24 క్యారెట్ల పుత్తడి రూ.160 వరకు తగ్గగా.. తులానికి రూ.59,950 పలుకుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల స్వర్ణం రూ.60,100 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,160కి తగ్గింది.
ముంబయిలో ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,950 వద్ద కొనసాగుతున్నది. బెంగళూరులో 22 క్యారెట్ల పుత్తడి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.59,950కి తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.54,950 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.59,950కి తగ్గింది. మరో వైపు వెండి ధర సైతం పతనమైంది. రూ.500 వరకు తగ్గి కిలోకు రూ.73,600కు చేరింది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77వేలు పలుకుతున్నది.