స్వల్పం పెరిగిన బంగారం.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

స్వల్పం పెరిగిన బంగారం.. హైదరాబాద్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?

విధాత‌: బంగారం ధరలు పైపైకి కదులుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు.. గురువారం మరోసారి స్వల్పంగా పెరిగాయి. తులానికి రూ.10 చొప్పున పెరిగాయి. 22 క్యారెట్ల పుత్తడి ధర రూ.55,460 పలుకుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,500 వద్ద కొనసాగుతున్నది. మరో వైపువెండి ధరలు నిలకడగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.55,610 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,650కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.55,660 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.60,720 పలుకుతున్నది.


ముంబయిలో ముంబయిలో 22 క్యారెట్ల పసిడి రూ.55,460 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,500కి పెరిగింది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,610 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,650 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.55,460 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.60,500 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలోకు రూ.78వేలు పలుకుతున్నది. ఇదిలా ఉండగా.. ప్లాటినం ధర తులానికి రూ.90 వరకు తగ్గి రూ.23,720కి చేరింది.