Gold Rate | బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్ సోమవారం బంగారం ధర స్వల్పంగా దిగివచ్చింది. మార్కెట్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులానికి రూ.66,550కి పడిపోయింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.330 తగ్గి తులానికి రూ.72,600కి పతనమైంది.
Gold Rate | బంగారం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్ సోమవారం బంగారం ధర స్వల్పంగా దిగివచ్చింది. మార్కెట్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులానికి రూ.66,550కి పడిపోయింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.330 తగ్గి తులానికి రూ.72,600కి పతనమైంది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,530కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.66,550 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.72,600కి పతనమైంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.66,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.72,750కి చేరింది.
హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.65,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.72,600 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు ధర పతనమైంది. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో రూ.87,500 పలుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.