Gold Rate | బంగారం ప్రియులకు షాక్‌..! మరోసారి పెరిగిన ధరలు.. తులానికి ఎంత పెరిగిందంటే..?

Gold Rate | విధాత: బంగారం ధరలు వినియోగదారులకు మరోసారి షాక్‌ ఇస్తున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ధరలు పెరగ్గా.. గురువారం మరోసారి పైకి కదిలాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది. స్వచ్ఛమైన బంగారంపై రూ.110 వరకు 61వేల మార్క్‌ను దాటింది. దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల […]

Gold Rate | బంగారం ప్రియులకు షాక్‌..! మరోసారి పెరిగిన ధరలు.. తులానికి ఎంత పెరిగిందంటే..?

Gold Rate |

విధాత: బంగారం ధరలు వినియోగదారులకు మరోసారి షాక్‌ ఇస్తున్నాయి. మొన్నటి వరకు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం ధరలు పెరగ్గా.. గురువారం మరోసారి పైకి కదిలాయి. ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.100 పెరిగింది.

స్వచ్ఛమైన బంగారంపై రూ.110 వరకు 61వేల మార్క్‌ను దాటింది. దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్‌ మార్కెట్‌లోనూ పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.55,950కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,040కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.56,100, పది గ్రాముల 24 గ్రాముల పుత్తడి ధర రూ.61,040కి ఎగిసింది. బెంగళూరులో 22 క్యారెట్ల ఆర్నమెంట్‌ బంగారం రూ.56వేలు, 24 క్యారెట్ల బంగారం రూ.61,100 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.56,420, స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ.రూ.61,550కి చేరాయి.

మరో వైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర కాస్త తగ్గింది. స్పాట్ గోల్డ్ ఔన్సు రేటు ప్రస్తుతం 1,991 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలా ఉండగా.. ఓ వైపు బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేయగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై రూ.200 వరకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలోకు రూ.80,200కి దిగిరాగా.. ఢిల్లీలో రూ.76,500కి తగ్గింది.