• Telugu News
  • /Business

Gold-Silver Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ధర

Gold-Silver Rates | మగువలకు బంగారం ధర షాక్‌ ఇచ్చింది. నిన్న స్వల్పంగా తగ్గిన ధర మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో భారీగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 పెరిగి తులానికి రూ.67,850 ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 పెరగడంతో తులానికి రూ.74,020కి చేరింది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 16, 2024, 9:57 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | మగువలకు షాక్‌ ఇచ్చిన పసిడి.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ధర

Gold-Silver Rates | మగువలకు బంగారం ధర షాక్‌ ఇచ్చింది. నిన్న స్వల్పంగా తగ్గిన ధర మంగళవారం బులియన్‌ మార్కెట్‌లో భారీగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.350 పెరిగి తులానికి రూ.67,850 ఎగిసింది. 24 క్యారెట్ల పసిడిపై రూ.380 పెరగడంతో తులానికి రూ.74,020కి చేరింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.68,300 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,510 పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.74,020కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.68వేలు ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.71,170కి దూసుకెళ్లింది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.74,020 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఓ వైపు బంగారం ధర భారీగా పెరగ్గా.. వెండి మాత్రం స్వల్పంగా ఊరటనిచ్చింది. కిలోకు రూ.200 తగ్గింది. దీంతో ఢిల్లీలో కిలో ధర రూ.95వేలకు తగ్గింది. హైదరాబాద్‌లో కిలో రూ.99,500 పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.