తగ్గేదెలే అంటున్న బంగారం..! రూ.63వేలకు చేరిన తులం బంగారం రేటు..!

తగ్గేదెలే అంటున్న బంగారం..! రూ.63వేలకు చేరిన తులం బంగారం రేటు..!

విధాత‌: పుత్తడి ధరలు కొనుగోలుదారులకు షాక్‌ ఇచ్చాయి. నిన్న స్థిరంగా కొనసాగిన ధరలు నేడు మార్కెట్‌లో భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.600 పెరిగి తులానికి రూ.57,400కి చేరింది. 24 క్యారెట్ల పుత్తడిపై రూ.660 పెరిగి.. తులం రూ.62,620కి ఎగిసింది. రాబోయే ధన్‌తేరస్‌, దీపావళి పండకి మరింత పెరగనున్నదని అంచనా వేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో బంగారానికి భారీగా డిమాండ్‌ ఉండే అవకాశం ఉంది.


ఈ క్రమంలో ధరలు పెరుగుతుండడంతో మధ్య తరగతి ప్రజలు ధరల పెరుగుదలతో ఆందోళనకు గురవుతున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,550 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,770కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,950కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,440 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,620కి ఎగిసింది.


బెంగళూరు, పుణే, కేరళ, కోల్‌కతా నగరాల్లోనే ఇదే ధర కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.57,400 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,620 వద్ద కొనసాగుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో పాటు తెలుగురాష్ట్రలంతా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.77,500 పలుకుతున్నది. మరో వైపు ప్లాటినం ధర స్వల్పంగా తగ్గింది. రూ.40 తగ్గి తులం ధర రూ.24,200కి చేరింది.