సామాన్యుడికి అందనంత ఎత్తుకు బంగారం..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

సామాన్యుడికి అందనంత ఎత్తుకు బంగారం..! హైదరాబాద్‌లో తులం ఎంత పలుకుతుందంటే..?

పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజు రోజుకు అందనంత ఎత్తుకు దూసుకెళ్తున్నది. ఇటీవల కాలంలో వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు సోమవారం సైతం స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్స్‌, 24 క్యారెట్లపై రూ.10 చొప్పున పెరిగింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.57,560 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62, 780 పలుకుతున్నది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,710 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,960కి పెరిగింది.


ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,410 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,630కి ఎగిసింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,410 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,630కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,410 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,630 పలుకుతున్నది. ఏపీలోని విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు సైతం మారలేదు. ప్రస్తుతం కిలో బంగారం హైదరాబాద్‌ రూ.77,500 వద్ద స్థిరంగా ఉన్నది.