Hero MotoCorp | రికార్డుస్థాయిలో హీరో బైక్స్ విక్రయాలు..!

ప్రముఖ ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ విక్రయాల్లో దూసుకుపోతున్నది. అక్టోబర్‌లో ద్విచక్ర వాహనాల విక్రయాలు రికార్డు స్థాయిలో జరిగాయి. అక్టోబర్‌లో 4,54,582 యూనిట్ల ద్విచక్ర వాహనాలు జరగ్గా.. ఎగుమతులతో కలిపి 5,74,930 బైక్స్‌ను విక్రయించింది. గతేడాది పోలిస్తే 26శాతం పెరుగడం విశేషం. గతేడాది ఇదే నెలలో 4,42,825 బైక్‌ల విక్రయాలు సాగాయి. అక్టోబర్‌లో కంపెనీ 15,164 వాహనాలను ఎగుమతి చేసింది. 2022 అక్టోబర్ మాసంలో 11,757 మాత్రమే ఎగుమతయ్యాయి. మరో వైపు ఇటీవల హీరో మోటోకార్ప్స్ హార్లీ డేవిడ్సన్ భాగస్వామ్యంతో ఎక్స్-440 సేల్స్‌ను ప్రారంభించింది.
అయితే, ఇప్పటి వరకు మోడల్ బైక్స్ వెయ్యి యూనిట్ల విక్రయాలు జరిగాయి. మరో వైపు కరిష్మా ఎక్స్‌ఎంఆర్ బైక్స్ డెలివరీలను హీరో మోటోకార్ప్స్ మొదలవగా.. ఇప్పటి వరకు 13వేల బుక్సింగ్ జరిగాయి. బైక్ ఎక్స్ షోరూం ధర రూ.1,72,900 ఉండగా.. ప్రస్తుతం ధర రూ.1,79,900కి పెరిగింది. హీరో కరిష్మా ఎక్స్‌ఎంఆర్ 210లో 210 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండనుంది. ఇది 25 హెచ్‌పీ పవర్‌ను, 30 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ దీని సొంతం. సేఫ్టీ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ మోడల్ ఫ్రెంట్, రేర్ వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయెల్ ఛానెల్ ఏబీఎస్ సెటప్‌తో రానున్నది.