JIO Alert | సైబర్ నేరాలపై యూజర్లకు కీలక అలెర్ట్ జారీ చేసిన జియో..!
JIO Alert | ఇటీవలకాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రైవేటురంగ టెలికం దిగ్గజం జియో యూజర్లకు కీలక అలెర్ట్‌ను జారీ చేసింది. జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని చెప్పాలని కొందరు సైబర్ నేరగాళ్లు కోరుతున్నారని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లను అప్రపత్తం చేస్తుంది.

JIO Alert | ఇటీవలకాలంలో పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో ప్రైవేటురంగ టెలికం దిగ్గజం జియో యూజర్లకు కీలక అలెర్ట్‌ను జారీ చేసింది. జియో ప్రతినిధులమంటూ వ్యక్తిగత సమాచారాన్ని చెప్పాలని కొందరు సైబర్ నేరగాళ్లు కోరుతున్నారని.. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ యూజర్లను అప్రపత్తం చేస్తుంది. తమ ప్రతినిధులమంటూ చెప్పుకొని యూజర్ల సున్నిత సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఇలాంటి సైబర్ మోసాలకు సంబంధించిన కేసులు తమ దృష్టికి వచ్చాయంటూ పేర్కొంది. సైబర్ ఫ్రాడ్స్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా, క్రెడిట్ కార్డ్, ఓటీపీ, సిమ్‌కార్డులకు సంబంధించి వివరాలను తెలుసుకునేందుకు వాట్సాప్ చాట్, ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, ఈ మెయిల్స్ ద్వారా కస్టమర్లను సంప్రదిస్తున్నారని. జియో ప్రతినిధులమని చెప్పుకొని వివరాలను అడుగుతున్నట్లుగా జియో పేర్కొంది. అయితే, అడిగిన వివరాలు ఇవ్వకుంటే సిమ్‌కార్డ్ బ్లాక్ అవుతుందని హెచ్చరిస్తున్నారని.. థర్డ్ పార్టీ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలని చెబుతున్నారని.. ఆ తర్వాత మొబైల్, కంప్యూటర్లలోని వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లుగా తెలిపింది.
అయితే, జియో ఎట్టి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ డౌన్‌లోడ్ చేయాలని.. మెయిల్ ద్వారా వచ్చే లింక్‌లపై క్లిక్ చేయాలని కోరదని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లో సిమ్‌పై ఉండే 20 అంకెల నెంబర్‌ను ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెప్పింది. యాప్‌లు, ఆన్‌లైన్ ఖాతాలకు సంబంధించిన పాస్‌వర్డ్‌లు, పిన్ నంబర్లను తరుచూ మార్చుకోవాలని సూచించింది. ఎవరైనా జియో ప్రతినిధులమంతా వ్యక్తిగత వివరాలు అడిగితే ఇవ్వకుండా.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరింది. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినా.. కేటగాళ్లు కొత్త కొత్త పంథాల్లో మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల జియో నెట్‌వర్క్ వినియోగదారులకు బ్యాలెన్స్ పూర్తవుతుందని.. రీచార్జ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలను అవకాశంగా వాడుకుంటూ రీచార్జ్ తక్షణం చేసుకోవాలని.. లేకపోతే సిమ్ బ్లాక్ అవుతుందంటూ మెసేజ్‌లు పంపి.. స్పందించిన యూజర్లను మోసం చేసిన ఘటనలు ఉన్నాయి. రీచార్జ్ పేరుతో పలువురి వద్ద రూ.లక్షల్లో డబ్బులు టోకరా వేసిన సందర్భాలు లేకపోలేదు.