ముఖేశ్ అంబానీ చేతుల్లోకి జస్ట్‌డయల్..?

విధాత,ముంబై:ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్‌‌ను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా జస్ట్‌డయల్ వ్యవస్థాపకులతో జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు రూ. 6600 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే, జస్ట్‌డయల్‌లో నమోదైన వ్యాపారాల వివరాలు రిలయన్స్‌కు తన రిటైల్ వ్యాపార విస్తరణలో ఎంతో ఉపకరించనున్నాయి. భారత రిటైల్ రంగంలో […]

ముఖేశ్ అంబానీ చేతుల్లోకి జస్ట్‌డయల్..?

విధాత,ముంబై:ముఖేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు లోకల్ సెర్చ్ ఇంజన్ జస్ట్ డయల్‌‌ను కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా జస్ట్‌డయల్ వ్యవస్థాపకులతో జరుపుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్టు సమాచారం. ఈ డీల్ విలువ దాదాపు రూ. 6600 కోట్ల వరకూ ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే, జస్ట్‌డయల్‌లో నమోదైన వ్యాపారాల వివరాలు రిలయన్స్‌కు తన రిటైల్ వ్యాపార విస్తరణలో ఎంతో ఉపకరించనున్నాయి.

భారత రిటైల్ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ రిటైల్‌ వడివడిగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రిటైల్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో రిలయన్స్ పోటీపడుతోంది. కాగా..జస్ట్‌డయల్ ప్రమోటర్లు వీఎస్ఎస్ మణి, ఇతర కుటుంబ సభ్యులకు సంస్థలో 35.5 శాతం వాటా ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 2787 కోట్లని అంచనా.