NeoZAP | ట్యాప్‌ చేయండి.. పేమెంట్‌ చేయండి..! నియోజాప్‌ డివైజ్‌ గురించి తెలుసా?

NeoZAP | దేశంలో డిజిటల్‌ పేమెంట్స్ ఓ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి. తాజాగా టెక్నాలజీ అందులోనూ సరికొత్త మార్పులను తీసుకువస్తున్నది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ లేకపోయినా చెల్లింపులు చేసేలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది.

NeoZAP | ట్యాప్‌ చేయండి.. పేమెంట్‌ చేయండి..! నియోజాప్‌ డివైజ్‌ గురించి తెలుసా?

NeoZAP | దేశంలో డిజిటల్‌ పేమెంట్స్ ఓ విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చాయి. తాజాగా టెక్నాలజీ అందులోనూ సరికొత్త మార్పులను తీసుకువస్తున్నది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ లేకపోయినా చెల్లింపులు చేసేలా సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇంటర్‌నెట్‌ లేకపోయినా చెల్లింపు చేసే టెక్నాలజీ అందుబాటులోకి రాగా.. తాజాగా నియోజాప్‌ అనే డివైజ్‌ అదే విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. ఇది ఒక ఎన్‌ఎఫ్‌సీ ట్యాగ్ డివైజ్‌. చూసేందుకు ఒక సిమ్‌కార్డులా అనిపిస్తుంది. దీన్ని మొబైల్‌ వెనుక బాగంలో అమర్చుకోవచ్చు. ఫోన్‌లో చార్జింగ్ లేకపోయినా సరే ఈ నియో యాప్‌ సహాయంతో సులభంగా యూపీఐ చెల్లింపులు చేసేయొచ్చు. ఎక్కడైనా సరే చెల్లింపు చేయాలంటే నియో జాప్ స్టిక్కర్‌పై ట్యాప్‌ చేసే సరిపోతుంది.

ఎలాంటి పిన్‌ని ఎంటర్‌ చేయాల్సిన అవసరం లేకుండా చెల్లింపులు చేసేందుకు అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఇందులో రూ.2వేలు మాత్రమే పేమెంట్స్‌ చేసే వీలుంటుంది. నియోజాప్‌ డివైజ్‌ని నియోఫినిటీ సంస్థ రూపొందించింది. భద్రతా పరంగానూ మెరుగైన ఫీచర్స్‌ ఉన్నాయి. హెడీడీఎస్‌సీ ఎర్గో ఫ్రాడ్ డిటెక్షన్ ఫీచర్ ఉంది. నియోఫినిటీ వెబ్‌సైట్‌లో రూ.33 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు. దీని ధర రూ.999 గా నిర్ణయించింది. ప్రీ బుకింగ్ చేసుకున్న మొదటి 1500 మంది కస్టమర్లకు ఈ నియో జాప్ డివైస్‌ని కేవలం రూ.499కే అందిస్తున్నది. నియోజాప్ ఓ వర్చువల్ బ్యాంక్ కార్డులా పనిచేస్తుంది. వినియోగదారులు తమ డెబిట్, క్రెడిట్ కార్డులు బయటికి తీయాల్సిన పనిలేకుండానే చిన్నపాటి ట్రాన్సాక్షన్స్‌ జరుపుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.