Nissan Magnite facelift | త్వరలో రోడ్లకి నిస్సాన్‌ మాగ్నైట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌..!

Nissan Magnite facelift | ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ భారత్‌లో బెస్టె్‌ సెల్లింగ్‌ మోడల్‌ మాగ్నైట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఈ మోడల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తూ భారత రోడ్లపై కనిపించింది. త్వరలోనే కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తున్నది.

Nissan Magnite facelift | త్వరలో రోడ్లకి నిస్సాన్‌ మాగ్నైట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌..!

Nissan Magnite facelift | ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం నిస్సాన్‌ భారత్‌లో బెస్టె్‌ సెల్లింగ్‌ మోడల్‌ మాగ్నైట్‌ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ను లాంచ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటికే ఈ మోడల్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేస్తూ భారత రోడ్లపై కనిపించింది. త్వరలోనే కంపెనీ ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తున్నది. నిస్సాన్​ ఫేస్​లిఫ్ట్​ ఎస్​యూవీ ఇంటీరియర్​లో భారీగానే మార్పులు చేసినట్లు తెలుస్తున్నది. కొత్త వేరియంట్‌తో పాటు అడిషనల్‌ ఫీచర్స్‌ వస్తాయని తెలుస్తున్నది. అయితే, ఓవరాల్‌ డాష్‌బోర్డ్‌ డిజైన్‌ మాత్రం మారకపోవచ్చని తెలుస్తున్నది.

దాంతో పాటు ఎగుమతుల కోసం నిస్సాన్‌ మాగ్సైట్‌ ఎస్‌యూవీలో లెఫ్ట్‌ హ్యాండ్‌ డ్రైవింగ్‌ వెర్షన్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధమవుతున్నది. విదేశాలకు వీటిని ఎగుమతి చేసేందుకు ఏర్పాటు చేస్తున్నది. కంపెనీ ఏడాదికి 25వేల నుంచి 30 వేల యూనిట్లు సిద్ధం చేయాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మోడల్​లోని ఇంజిన్​ని నిస్సాన్​ మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​లో కూడా వినియోగించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం ఎస్​యూవీలో 1.0 లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉండగా.. 72 హెచ్​పీ పవర్​ని, 96 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది. టర్బో వర్షెన్​లో ఇంజిన్​ 100 హెచ్​పీ పవర్​ని.. 160 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

ఇందులో ఫైవ్‌ స్పీడ్​ మాన్యువల్​, ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉన్నాయి. ఫేస్‌లిఫ్ట్‌ వర్షన్‌లోనూ ఇవే కొనసాగించే అవకాశాలున్నాయి. ఇక మాగ్నైట్​ ఫేస్​లిఫ్ట్​ ధరకు సంబంధించిన వివరాలు మాత్రం తెలియరాలేదు. ప్రస్తుత వర్షెన్‌తో పోలిస్తే.. ఫేస్‌లిఫ్ట్‌ ధర ఎక్కువగానే ఉండవచ్చని తెలుస్తున్నది. ప్రస్తుతం భారత్‌లో నిస్సాన్​ మాగ్నైట్​ ఎక్స్​షోరూం ధర రూ.6లక్షల నుంచి మొదలవుతుంది. మరో వైపు ఫేస్‌లిఫ్ట్‌ వర్షెన్‌ను ఎప్పుడు లాంచ్‌ చేయబోతున్నదో తెలియరాలేదు. అయితే, వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే లాంచ్‌ చేసే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక త్వరలోనే కంపెనీ ప్రకటన చేసే అవకాశాలున్నాయి.