NVIDIA Shares | ఇందుకే కదా ఓపిక పట్టాలనేది..! ఇన్వెస్టర్లకు కాసులు కురిపిస్తున్న ఎన్విడియా షేర్లు..!
NVIDIA Shares | స్టాక్ మార్కెట్ (Stock Market)లో పలు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుంటాయి. చాలామంది పెట్టుబడి పెట్టి.. తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఆర్జించాలని చూస్తుంటారు. మరికొందరు పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయం కోసం ఎదురుచూస్తుంటారు.

NVIDIA Shares | స్టాక్ మార్కెట్ (Stock Market)లో పలు కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల పంట పండిస్తుంటాయి. చాలామంది పెట్టుబడి పెట్టి.. తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని ఆర్జించాలని చూస్తుంటారు. మరికొందరు పెట్టుబడి పెట్టి దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయం కోసం ఎదురుచూస్తుంటారు. అయితే, ఓపికతో ఎదురుచూసిన మదుపర్లను కొన్ని స్టాక్స్ సంపన్నులు చేస్తుంటాయి. అదే తరహాలో అమెరికాకు చెందిన చిప్‌ల తయారీ కంపెనీ ‘ఎన్విడియా’ స్టాక్స్ (NVIDIA Stocks) సైతం ఈ కోవకే వస్తుంది. ఏఐ, రోబోటిక్స్, అటానమస్ వెహికల్స్‌తో పాటు అత్యాధునిక సాంకేతికత పరికరాలలో ఉపయోగించే పలురకాల చిప్‌లను తయారు చేస్తున్న ఈ కంపెనీ షేర్లు మార్కెట్లో దూసుకుపోతున్నాయి.
ఏఐకి డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్విడియా షేర్లు సైతం పరుగులుపెడుతున్నాయి. ఈ షేర్ ధర 3శాతానికిపైగా వృద్ధి చెంది 135.58 డాలర్ల వద్ద స్థిరపడింది. ఎన్విడియా కంపెనీ 1999లో ఐపీవో ద్వారా అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయ్యింది. ఆ సమయంలో కంపెనీలో రూ.10వేల పెట్టుబడిన వారి సంపద నేడు రూ.10.3కోట్లకు పెరిగింది.
ఎన్విడియా ఐపీవో సమయంలో ఒక్కో షేర్ ధర 12 డాలర్లుగా ఉంది. ఒక్క షేర్ ప్రస్తుతం 480 షేర్లుగా స్ల్పిట్ అయ్యింది. అప్పుడు రూ.10వేలతో కొన్న షేర్ల సంఖ్య 9,120కి పెరిగింది. ఒక్కొక్క స్టాక్ విలువ దాదాపు 135.58 డాలర్లుగా ఉన్నది. భారతీయ కరెన్సీలో (మారకపు విలువ రూ.83.40) సుమారు రూ.10.3 కోట్లుగా ఉంది. అంటే నాడు రూ.10 వేల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టనవారంతా ఇప్పుడు మిలియనీర్లుగా మారారు. ఎన్విడియా షేర్లు దాదాపు 3 శాతంపైగా వృద్ధి చెందడంతో కంపెనీ సీఈవో జాన్సన్ హువాంగ్ సంపద ఒకే రోజు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33.4 వేల కోట్లు) మేర పెరిగి 119 బిలియన్ డాలర్లకు చేరింది.