SMFG ఇండియా క్రెడిట్ నూతన CEOగా రవి నారాయణన్
భారత్‌లోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCs) ఒకటైన SMFG ఇండియా క్రెడిట్ (SMICC) తన తదుపరి వృద్ధి, ఆవిష్కరణల దశకు నాయకత్వం వహించడానికి రవి నారాయణన్‌ను నూతన సీఈఓగా నియమించింది. ఈ నియామకం ఆగస్టు 28, 2025 నుండి అమల్లోకి వస్తున్నట్లు వెల్లడిచింది

విధాత, ముంబై: భారత్‌లోని ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో (NBFCs) ఒకటైన SMFG ఇండియా క్రెడిట్ (SMICC) తన తదుపరి వృద్ధి, ఆవిష్కరణల దశకు నాయకత్వం వహించడానికి రవి నారాయణన్‌ను నూతన సీఈఓగా నియమించింది. ఈ నియామకం ఆగస్టు 28, 2025 నుండి అమల్లోకి వస్తున్నట్లు వెల్లడిచింది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లలో సీనియర్ నాయకత్వ పదవుల్లో పనిచేసిన రవి నారాయణన్‌కు రిటైల్, బ్రాంచ్ డిస్ట్రిబ్యూషన్‌లో మూడు దశాబ్దాలకు పైగా విస్తృత అనుభవం ఉంది. ఆయన గతంలో యాక్సిస్ సెక్యూరిటీస్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ బోర్డులలో కూడా సభ్యుడిగా పనిచేశారు.
ఈ సందర్భంగా SMFG ఇండియా క్రెడిట్ ఛైర్మన్ రాజీవ్ కన్నన్ మాట్లాడుతూ, “రవి నారాయణన్‌ను SMFG ఇండియా క్రెడిట్ సీఈఓగా నియమించడం చాలా సంతోషంగా ఉంది. రిటైల్, బ్రాంచ్ నెట్‌వర్క్‌లో ఆయనకున్న అపారమైన అనుభవం SMFG ఫ్రాంచైజీని తదుపరి వృద్ధి దశలోకి నడిపించి, వాటాదారులకు గణనీయమైన విలువను సృష్టిస్తుందని నేను నమ్ముతున్నాను” అని అన్నారు. తన నూతన బాధ్యతలపై రవి నారాయణన్ స్పందిస్తూ, “SMFG ఇండియా క్రెడిట్ యొక్క బలమైన పునాది ఆధారంగా, మన రిటైల్ వ్యాపారాన్ని వేగవంతం చేయడానికి, దేశవ్యాప్తంగా మా బ్రాంచ్ నెట్‌వర్క్ ద్వారా కస్టమర్లతో సంబంధాలను మరింత పెంచడానికి ఇక్కడి అంకితభావం కలిగిన నాయకులు, ఉద్యోగులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను” అని తెలిపారు. అలాగే, తన ప్రధాన లక్ష్యాలను వివరిస్తూ, “సుస్థిరమైన వృద్ధిని సాధించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం, మా రిస్క్, కంప్లయెన్స్ కల్చర్‌ను బలోపేతం చేయడం ద్వారా వాటాదారులందరికీ దీర్ఘకాలిక విలువను అందించడమే నా ప్రాధాన్యత. 400 సంవత్సరాల వారసత్వం ఉన్న SMBC గ్రూప్‌లో చేరడం, భారతదేశంలో దాని అడుగుజాడలను విస్తరించడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఈ ప్రయాణాన్ని ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.