Reliance Jio New Plan | మీరు ఇంటర్నెట్‌లో ఎక్కువగా స్పోర్ట్స్ చూస్తారా.. అయితే జియో సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్ మీ కోసమే..!
Reliance Jio New Plan | భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త ప్లాన్‌ను రూపొందించింది. ఏడాది కాలానికి వర్తించే ఈ ప్లాన్ ధర రూ.3,333 మాత్రమే. ఈ ప్యాక్ తీసుకున్న వారు ఇంటర్నెట్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ సహా ఇతర ఆటలను వీక్షించవచ్చు.

Reliance Jio New Plan : భారత టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) మరో ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్పోర్ట్స్ ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ సరికొత్త ప్లాన్‌ను రూపొందించింది. ఏడాది కాలానికి వర్తించే ఈ ప్లాన్ ధర రూ.3,333 మాత్రమే. ఈ ప్యాక్ తీసుకున్న వారు ఇంటర్నెట్‌లో క్రికెట్, ఫుట్‌బాల్, ఫార్ములా వన్ సహా ఇతర ఆటలను వీక్షించవచ్చు. ఈ రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌తో రోజుకు 2.5 జీబీ డేటా, 100 ఎసెమ్మెస్‌లు, అపరిమిత కాలింగ్ సౌకర్యం లభిస్తుంది.
దీని వ్యాలిడిటీ 365 రోజులు. జియో టీవీ మొబైల్ యాప్ ద్వారా ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ ఈ ప్లాన్ ప్రత్యేకత. ఈ ఫ్యాన్ కోడ్ గడువు కూడా ఏడాది. మామూలుగా అయితే ఫ్యాన్ కోడ్ కోసం నెలకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక ప్లాన్ అయితే రూ.999 ఉంటుంది. కానీ జియో కొత్త ప్లాన్‌తో ప్రత్యేకంగా చెల్లించాల్సిన అవసరం లేదు. దీంట్లో జియో సినిమా, జియోటీవీ, జియోక్లౌడ్ సభ్యత్వం కూడా పొందొచ్చు. జియో సినిమాలో ప్రీమియం కంటెంట్‌ను మాత్రం వీక్షించలేరు.
ఈ ప్లాన్ యూజర్లు ఉచితంగా 5జీ డేటానూ పొందొచ్చు. జియో యాప్, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో రూ.2,999 వార్షిక ప్లాన్‌ను కూడా రోజుకు 2.5 జీబీ డేటాతో అందిస్తుంది. ఈ ప్లాన్‌లో కూడా దాదాపు రూ.3,333 ప్లాన్ ప్రయోజనాలే ఉంటాయి. కానీ ఫ్యాన్ కోడ్ సబ్‌స్క్రిప్షన్ లభించదు.