భారీగా పెరిగిన వెండి.. స్వల్పంగా తగ్గిన బంగారం.. నేడు హైదరాబాద్‌లో ధరలు ఇవే..

కొనుగోలుదారులకు బంగారం ధరలు స్వల్ప ఊరటనిచ్చాయి. నిన్నా మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.210 తగ్గి రూ.57,200కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.230 తగ్గి తులానికి రూ.62,400 పలుకుతున్నది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల తదితర కారణాలతో బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పలు నగరాల్లోనూ ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.62,550కి చేరింది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.57,350 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,560కి పతనమైంది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.62,400కి తగ్గింది. బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.62,400కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.62,400 పలుకుతున్నది. ఏపీలోని తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు భారీగానే పెరిగాయి. కిలోకు రూ.1000 పెరిగి కిలో ధర రూ.75,600కి ఎగిసింది. హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.78,500 పలుకుతున్నది.