MoU: తెలంగాణ ప్రభుత్వంతో.. గోద్రెజ్ క్యాపిటల్ ఎంవోయూ

తెలంగాణ: గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్‌కు చెందిన ఆర్థిక సేవల కంపెనీ గోద్రెజ్ క్యాపిటల్ తమ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల ద్వారా తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రుణ, వ్యాపార అవకాశాల లభ్యతను పెంచి ఎంఎస్ఎంఈల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడనుంది. తొలిసారిగా రుణం తీసుకుంటున్నవారు, ముఖ్యంగా రుణ సదుపాయం అంతగా లేనివారికి రుణాల లభ్యతను మెరుగుపర్చడం ద్వారా ఎంఎస్ఎంఈ వ్యవస్థను పటిష్టం చేయడం ఈ భాగస్వామ్య లక్ష్యం.
తొలిసారిగా రుణాలు తీసుకుంటున్నవారు, రుణ సదుపాయం తక్కువగా ఉన్నవారికి తెలంగాణ ఎంఎస్ఎంఈ పాలసీ 2024కి అనుగుణంగా రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు ఈ భాగస్వామ్యం తోడ్పడనుంది.
గోద్రెజ్ క్యాపిటల్‌కు చెందిన ఆరోహి పథకం కింద మహిళా ఎంట్రప్రెన్యూర్లపై ప్రత్యేక దృష్టి సారించి, విశేష ప్రయోజనాలు, విస్తృత రుణ అర్హతలను అందించనున్నారు.
మహిళల కోసం ఉద్దేశించిన ఆరోహి పథకం ద్వారా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. “ఎంఎస్ఎంఈ వ్యవస్థను పటిష్టం చేయడంలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడం మాకు గర్వకారణం. ఎంఎస్ఎంఈ వ్యవస్థకు, ముఖ్యంగా మహిళల సారథ్యంలోని సంస్థలకు సాధికారత కల్పించే దిశగా ఈ భాగస్వామ్యం కీలక ముందడుగు కాగలదు” అని గోద్రెజ్ క్యాపిటల్ ఎండీ & సీఈవో మనీష్ షా తెలిపారు. “స్థానిక ఎంఎస్ఎంఈలు, ముఖ్యంగా మహిళా ఎంట్రప్రెన్యూర్లకు అనుగుణంగా వినూత్నమైన, డిజిటల్ ఫస్ట్ రుణ సొల్యూషన్స్‌ను అందుబాటులోకి తెచ్చే క్రమంలో గోద్రెజ్ క్యాపిటల్ లిమిటెడ్ అనుబంధ సంస్థలైన గోద్రెజ్ ఫైనాన్స్ లిమిటెడ్, గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌తో జట్టు కట్టడం సంతోషకరం.
ఇటీవల ప్రవేశపెట్టిన ఎంఎస్ఎంఈ పాలసీ కింద రుణ సదుపాయం తక్కువగా ఉన్న ఎంఎస్ఎంఈలకు రుణ లభ్యతను మెరుగుపర్చే దిశగా ఆర్థిక సంస్థలతో ఇలాంటి భాగస్వామ్యాలను కుదుర్చుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ దిశగా ఈ ఎంవోయూ కీలక ముందడుగు కాగలదు” అని పరిశ్రమలు & వాణిజ్య విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీ Dr. జయేష్ రంజన్ తెలిపారు. ఎంఎస్ఎంఈలు, ఇతర రుణార్థుల అవసరాలకు అనుగుణంగా తమ అనుబంధ సంస్థల ద్వారా గోద్రెజ్ క్యాపిటల్ వివిధ రకాల రుణ సాధనాలను అందిస్తోంది. ప్రాపర్టీపై రుణాలు, చిన్న మొత్తాల్లో ఉద్యోగ్ లోన్ ఎగెనెస్ట్ ప్రాపర్టీ, అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్స్ మొదలైనవి వీటిలో ఉన్నాయి.