Actress|సినిమాలు ప‌క్క‌న పెట్టి బిజినెస్‌లోకి.. ఏడాదికి రూ.400 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవ‌రంటే..!

Actress| ఇప్పుడు క‌థానాయిక‌లు సినిమాల‌తో బాగానే వెన‌కేసుకుంటున్నారు. దీపం ఉన్న‌ప్పుడే దున్నేయాల‌నే పాల‌సీతో ఎడాపెడా రెమ్యున‌రేష‌న్స్ పెంచేసి బాగానే జేబులు నింపుకుంటున్నారు. ఆపై యాడ్స్, సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌లు ఇలా ప‌లు ర‌కాలుగా ఆర్జిస్తున్నారు. అయితే ఎంత చే

  • By: sn    cinema    May 04, 2024 7:50 PM IST
Actress|సినిమాలు ప‌క్క‌న పెట్టి బిజినెస్‌లోకి.. ఏడాదికి రూ.400 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్ ఎవ‌రంటే..!

Actress| ఇప్పుడు క‌థానాయిక‌లు సినిమాల‌తో బాగానే వెన‌కేసుకుంటున్నారు. దీపం ఉన్న‌ప్పుడే దున్నేయాల‌నే పాల‌సీతో ఎడాపెడా రెమ్యున‌రేష‌న్స్ పెంచేసి బాగానే జేబులు నింపుకుంటున్నారు. ఆపై యాడ్స్, సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌లు ఇలా ప‌లు ర‌కాలుగా ఆర్జిస్తున్నారు. అయితే ఎంత చేసిన కూడా ఏడాదికి రూ.400 కోట్లు సంపాదిస్తారా. అది అసంభ‌వ‌మే. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఒక‌ప్పుడు సినిమాల‌లో న‌టించి ఆ త‌ర్వాత వాటికి చెక్ పెట్టి బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఏడాదికి 400 కోట్లకుపైగా సంపాదిస్తుంద‌ట‌. మ‌రి ఇంత‌కు ఆ బ్యూటీ ఎవ‌ర‌నే క‌దా మీ డౌట్.. ఆమె పేరు ఆష్కా గొరాడియా. 2002 నుంచి హిందీ టీవీ సీరియల్స్‌లో న‌టిస్తూ వ‌చ్చింది.

జీ టీవీ, సోనీ టీవీ వంటి పలు ప్రముఖ ఛానెళ్లలో ప్రసారమయ్యే ప్ర‌ముఖ‌ సీరియల్స్‌లో నటించి ఫేమస్ అయిన కొరాడియా చివరిసారిగా 2019లో ప్రసారమైన తాయాన్ సీరియల్‌లో క‌నిపించింది. ఇక ఆ స‌మ‌యంలో న‌ట‌న‌కు స్వ‌స్తి చెప్పిన ఆమె మెల్ల‌గా వ్యాపారంలోకి అడుగుపెట్టింది. రెనీ అనే కాస్మోటిక్స్ కంపెనీని ప్రారంభించ‌గా, అది ప్రారంభించిన కొద్ది రోజుల‌కే లాభాల మీద లాభాలు రావ‌డం జ‌రిగింది. ఆష్కా కొరాడియా స్థాపించిన కంపెనీ కేవలం రెండేళ్లలో 100 మిలియన్ డాలర్ల(భారతీయ విలువ 834 కోట్ల)కు పెరగ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

2024 ఆర్థిక సంవత్సరంలో అక్ష కొరాడియాకు చెందిన రెనీ కంపెనీ 400 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. స‌రైన స‌మ‌యంలో ఇండ‌స్ట్రీని వ‌దిలేసి ఆమె పారిశ్రామిక‌వేత్త‌గా జెండా ఎగుర‌వేసి ఇప్పుడు కోట్ల‌ని ఆర్జిస‌తుంది. ఆమె ఎదుగుద‌ల‌ని చూసి అంద‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.ఆష్కా ముందు స‌మంత‌, న‌య‌న‌తార వంటి వారు కూడా స‌రితూగ‌రు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్ప‌టి న‌టీమ‌ణులెంద‌రికో ఆమె త‌ప్ప‌క ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ప్ర‌స్తుతం సినిమాలు చేస్తూనే బిజినెస్ లు కూడా చేస్తుంది. లిప్పమ్, 9స్కిన్ వంటి సంస్థల ద్వారా కోట్లాది రూపాయలు సంపాదిస్తోంది. దీంతో పాటు పెమీ9, డివైన్ పుట్స్, సాయి వేల్ వంటి కంపెనీల్లోనూ పెట్టుబడులు కూడా పెట్టింది. మ‌రోవైపు స‌మంత సాహి అనే టెక్స్‌టైల్ న‌డుపుతూనే మ‌రోవైపు న‌ర్స‌రీ స్కూల్ ఒక‌టి న‌డుపుతుంది. ఈ కామ‌ర్స్ కంపెనీలో ప‌లు పెట్టుబ‌డులు కూడా పెట్టింది.