డ్రగ్స్ కేసుపై స్పందించిన నటుడు ప్రకాశ్‌రాజ్
విధాత,హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. భావి తరాలను నాశనం చేసే డ్రగ్స్‌ను ఉపేక్షించవద్దన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నా..దోషులుగా తేలితే శిక్షించాల్సిందేనని చెప్పారు. ‘మా’ ప్యానెల్లో ఉన్న తనీష్‌పై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని.. ఆరోపణలు రుజువైతే ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌ను దాదాపు 6గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, […]

విధాత,హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. భావి తరాలను నాశనం చేసే డ్రగ్స్‌ను ఉపేక్షించవద్దన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నా..దోషులుగా తేలితే శిక్షించాల్సిందేనని చెప్పారు. ‘మా’ ప్యానెల్లో ఉన్న తనీష్‌పై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని.. ఆరోపణలు రుజువైతే ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు.
మరోవైపు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌ను దాదాపు 6గంటల పాటు ప్రశ్నించింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను ఈడీ సుదీర్ఘంగా విచారించింది.