Aishwarya Rai| ఇప్పటికైన పుకార్లు ఆపండి.. అభిషేక్, ఐశ్వర్యరాయ్ విడిపోలేదు.. ఇదే క్లారిటీ..!
Aishwarya Rai| అనంత్ అంబానీ పెళ్లి ఎంతో అట్టహాసంగా జరగగా, దీని గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చ

Aishwarya Rai| అనంత్ అంబానీ పెళ్లి ఎంతో అట్టహాసంగా జరగగా, దీని గురించే అందరు మాట్లాడుకుంటున్నారు. ఇదే సమయంలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అయింది. అనంత్, రాధికల పెళ్లిలో ఐశ్వర్య, అభిషేక్‌ల తీరు చూసి వీరిద్దరు విడిపోయారంటూ తెగ పుకార్లు పుట్టించారు. అందుకు కారణం ఏంటంటే..అంబాని పెళ్లికి చాలా మంది స్టార్ లు తమ ఫ్యామిలీస్ తో వచ్చారు . కాని ఐశ్వర్యరాయ్ మాత్రం అభిషేక్ బచ్చన్‌తో కాకుండా సోలోగా వచ్చింది. అభిషేక్ బచ్చన్ తన తండ్రి, తల్లి, సోదరితో కలిసి అనంత్ అంబానీ పెళ్లికి వచ్చారు. ఇలా ఇద్దరు విడివిడిగా అంబాని పెళ్లిలో కనిపించే సరికి మళ్లీ విడాకుల విషయం గురించి అనేక ప్రచారాలు సాగాయి.
అయితే ఈ సమయంలో ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తుండగా, ఇది చూసిన వారందరు కూడా ఐష్-అభిషేక్ విడిపోలేదు అని అంటున్నారు. వీడియోలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పక్కపక్కనే కూర్చోవడం వీడియోలో కనిపించింది. ఐశ్వర్యరాయ్ ఉత్సాహంగా తన కూతురితో ముచ్చట్లాడుతున్నట్టు వీడియోలో ఉంది. అభిషేక్ మాత్రం వెడ్డింగ్ వేడుకను తదేకంగా చూస్తున్నారు. వీడియోలో ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటను మాత్రం జూమ్ చేసి చూపించడంతో ఆసక్తికరంగా మారింది. అయితే విడివిడిగా వచ్చిన కూడా ఇద్దరు పక్క పక్కన కూర్చోవడంతో పుకార్లకి పులిస్టాప్ పడ్డట్టు అయింది. ఇక ఇప్పటికైన వారిద్దరు విడిపోయారంటూ పుకార్లు పుట్టిచ్చొదంటూ అభిమానులు కోరుతున్నారు.
ఐశ్వర్య సినిమాలు తగ్గించేసాక బచ్చన్ ఫ్యామిలీ తోనే కలిసి ఉంటుంది. అప్పుడప్పుడు పలు ఫంక్షన్‌లలో అభిషేక్‌తో కలిసి సందడి చేస్తుంటుంది. అయితే ఎప్పుడైతే తాను సోలోగా కనిపించిందో వెంటనే వారి విడాకుల రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. వీటిపై ఐశ్వర్యరాయ్ ఏ మాత్రం స్పందించడం లేదు. అభిషేక్ మాత్రం కొన్ని సందర్భాలలో సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Aaradhya & #AbhiAish ♥️ #AnantwedsRadhika #AishwaryaRaiBachchan #AbhishekBachchan pic.twitter.com/kel8kvxlmp
— Aishwarya Rai Fan (@amit_AishGang) July 13, 2024