Manam Movie | జపాన్‌లో విడుదలైన అక్కినేని ‘మనం’ సినిమా
అక్కినేని వారి 'మనం' సినిమా జపాన్ లో విడుదల! నాగార్జున, చైతన్య, అఖిల్ పునర్జన్మ కథతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు!

Manam Movie | విధాత : అక్కినేని కుటుంబంలోని మూడు తరాలు నటించిన ‘మనం’ సినిమా శుక్రవారం జపాన్ లో విడుదలైంది. అక్కినేని నాగేశ్వర్ రావు ఆఖరి సినిమాగా నిలిచిపోయిన మనం మూవీలో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ అక్కినేని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో 2014 మే 23న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దాదాపు 50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇన్నాళ్లకు జపాన్ లో మనం సినిమాను విడుదల చేయడం విశేషం. ఈ సందర్భంగా నాగార్జున, నాగచైతన్యలు సంయుక్తంగా ఓ ప్రమోషన్ వీడియో విడుదల చేశారు. మనం సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనదని, నాగేశ్వర్ రావు చివరి సినిమాగా చిరస్మరణియమైందన్నారు. జపాన్ ప్రేక్షకులకు కూడా కచ్చితంగా మనం మూవీ నచ్చుతుందని అని ఆశిస్తున్నామన్నారు. వారిద్దరూ జపాన్ భాషలో కూడా మాట్లాడుతూ సినిమాను ఆదరించాలని జపాన్ ప్రేక్షకులను కోరారు.
జపాన్‌లో అక్కినేని నాగార్జునకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడి అభిమానులు ఆయనను ‘నాగ్ సామా’ అని పిలుస్తారు. జపాన్ లో మనం విడుదల సందర్బంగా నాగార్జున వర్చువల్‌గా ఒక స్క్రీనింగ్‌కు హాజరై, అభిమానులతో సంభాషించనున్నారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమా ప్రేమ, పునర్జన్మల చుట్టూ తిరిగే ఒక ఫాంటసీ డ్రామాగా రూపొందింది. సమంత శ్రియ శరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
Bulletu Bandi | వచ్చేసిన ‘బుల్లెట్టు బండి’ టీజర్
US India Tarrif | అమెరికా సుంకాలపై ధీటుగా భారత్ కౌంటర్