అనుపమ పరమేశ్వరన్ లుక్ అదుర్స్ .. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!

రంజాన్ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు సినీ ప్ర‌ముఖులు అంతా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న‌దైన శైలిలో ఈద్ ముబార‌క్ తెలిపింది. ఏకంగా ముస్లిం యువ‌తి గెట‌ప్‌లో శుభాకాంక్ష‌లు తెలిపింది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫొటోల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది అనుప‌మ‌. ఏ పండుగ వ‌చ్చినా కూడా ఆ సంప్ర‌దాయంలోకి మారిపోతుంటుంది. ఇప్పుడు రంజాన్ సంద‌ర్బంగా ముస్లిం యువ‌తిలా ఫొటో దిగింది. బుర్ఖా వేసుకుని.. కంటికి కాజ‌ల్ పెట్టుకుని అచ్చం ముస్లిం యువ‌తిలా దిగిన […]

అనుపమ పరమేశ్వరన్ లుక్ అదుర్స్ .. ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్..!

రంజాన్ సంద‌ర్భంగా ముస్లిం సోద‌రుల‌కు సినీ ప్ర‌ముఖులు అంతా శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ త‌న‌దైన శైలిలో ఈద్ ముబార‌క్ తెలిపింది. ఏకంగా ముస్లిం యువ‌తి గెట‌ప్‌లో శుభాకాంక్ష‌లు తెలిపింది.

ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫొటోల‌తో అభిమానుల‌ను అల‌రిస్తూనే ఉంటుంది అనుప‌మ‌. ఏ పండుగ వ‌చ్చినా కూడా ఆ సంప్ర‌దాయంలోకి మారిపోతుంటుంది. ఇప్పుడు రంజాన్ సంద‌ర్బంగా ముస్లిం యువ‌తిలా ఫొటో దిగింది. బుర్ఖా వేసుకుని.. కంటికి కాజ‌ల్ పెట్టుకుని అచ్చం ముస్లిం యువ‌తిలా దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ముస్లిం సోద‌రుల‌కు ఈద్ ముబార‌క్ తెలిపింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అనుప‌మకు వాళ్ల నుంచి అభినంద‌న‌ల వెల్లువ కురుస్తుంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది అనుపమ పరమేశ్వరన్ . ఈ రెండు సినిమాలు కూడా నిఖిల్ తోనే చేస్తుండటం గమనార్హం. సుకుమార్ రైటింగ్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 18 పేజెస్ సినిమాలో నటిస్తుంది అను. ఈ సినిమాను కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు కార్తికేయ 2లోనూ ఈమె నటిస్తుంది.