Asin | వీళ్లకేమైంది.. మరో హీరోయిన్‌ విడాకులు! ఏ కారణంతో విడిపోయారంటే..?

Asin | సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా అసిన్ విడాకుల వ్య‌వ‌హారం టాలీవుడ్ ప్ర‌ముఖుల ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారాలు ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఏదో సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేలో ప‌డ‌డం, ఆ త‌ర్వాత కొన్నాళ్లకి పెళ్లి చేసుకోవ‌డం ఏదో మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడాకులు తీసుకోవ‌డం కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తుంది. కొన్ని నెలల క్రితం నాగ చైత‌న్య‌- స‌మంత విడిపోవ‌డం, ఆ త‌ర్వాత ధ‌నుష్‌, అమీర్ ఖాన్ వంటి వారు త‌మ భార్య‌ల‌కి విడాకులు ఇవ్వ‌డం ఇండ‌స్ట్రీలో […]

  • By: sn    cinema    Jun 28, 2023 2:16 AM IST
Asin | వీళ్లకేమైంది.. మరో హీరోయిన్‌ విడాకులు! ఏ కారణంతో విడిపోయారంటే..?

Asin |

సినీ ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ‌నీయాంశంగా అసిన్ విడాకుల వ్య‌వ‌హారం

టాలీవుడ్ ప్ర‌ముఖుల ప్రేమ‌, పెళ్లి వ్య‌వ‌హారాలు ఇటీవ‌ల ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఏదో సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రేలో ప‌డ‌డం, ఆ త‌ర్వాత కొన్నాళ్లకి పెళ్లి చేసుకోవ‌డం ఏదో మ‌న‌స్ప‌ర్ధ‌ల వ‌ల‌న విడాకులు తీసుకోవ‌డం కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తుంది.

కొన్ని నెలల క్రితం నాగ చైత‌న్య‌- స‌మంత విడిపోవ‌డం, ఆ త‌ర్వాత ధ‌నుష్‌, అమీర్ ఖాన్ వంటి వారు త‌మ భార్య‌ల‌కి విడాకులు ఇవ్వ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ క్యూట్ లేడి అసిన్ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇవ్వ‌బోతున్నట్టు నెట్టింట తెగ ప్ర‌చారం న‌డుస్తుంది. ఆసిన్ తెలుగులో ప‌లు సూప‌ర్ హిట్ చిత్రాల‌లో న‌టించ‌గా, ఆ త‌ర్వాత ప‌లు త‌మిళ సినిమాలు కూడా చేసింది.

అయితే అసిన్ కెరీర్ పీక్స్ లో ఉండ‌గా, 2016 లో రాహుల్ శర్మ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఆసిన్. ఆసిన్ భ‌ర్త రాహుల్ మైక్రో మాక్స్ కంపెనీ కి సి.ఈ.ఓగా పని చేస్తుండ‌గా, వీరి పెళ్లికి బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఎంతో సాయం చేశారు.

కొన్నాళ్ల పాట ఆసిన్ ఆమ భ‌ర్త ఎంతో అన్యోన్యంగా ఉంటూ వ‌స్తున్నారు. అయితే ఏమైందో ఏమో తెలియ‌దు కాని అసిన్ త‌న భ‌ర్త‌కు విడాకులు ఇచ్చినట్టు సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం సాగుతుంది. తన భ‌ర్త వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవ‌డం వ‌ల్ల‌నే ఆసిన్ విడాకులు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తుంది.

ఆసిన్..రాహుల్ శర్మను ఎంత హెచ్చ‌రించిన కూడా తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో అతని నుండి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. పాప ఉన్నా కూడా ఆసిన్ విడాకులు తీసుకోవడానికి సిద్ధమయ్యిందని ప్ర‌చారం న‌డుస్తుంది.

గ‌త కొద్ది గంట‌లుగా ఆసిన్ విడాకుల‌పై జోరుగా ప్ర‌చారాలు సాగుతుండ‌డ‌గా, దీనిపై క్లారిటీ అయితే రావ‌డం లేదు. ఇక అసిన్ విష‌యానికి వ‌స్తే.. తెలుగులో మొదటగా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్ష‌కులకి ద‌గ్గ‌రైంది.

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో.. మాస్ మహారాజ్ రవితేజతో నటించిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ కొట్టిదో మ‌నంద‌రికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆసిన్.. కింగ్ నాగార్జున‌తో శివమణి, బాలకృష్ణతో లక్ష్మీనరసింహ, వెంకటేష్‌తో ఘర్షణ, సినిమాలు వరుసగా సక్సెస్ అందుకున్నాయి. అన్న‌వ‌రం, చ‌క్రం సినిమాలు అంత‌గా అల‌రించ‌లేకపొయాయి.