Bigg Boss8|హీటెక్కిన నామినేషన్స్..ఈ వారం ఎంత మంది నామినేషన్స్‌లో ఉన్నారంటే..!
Bigg Boss8|బిగ్ బాస్ సీజన్ 8 షో నుండి ఒక్కో కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం నయని పావని బయటకు రాగా, ఈ వారం హౌజ్ నుండి బయటకు వచ్చేందుకు గాను నామినేషన్ ప్రక్రియ జరిగింది.ఈ ప్రక్రియ చాలా వాడివేడిగానే జరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు

Bigg Boss8|బిగ్ బాస్ సీజన్ 8 షో నుండి ఒక్కో కంటెస్టెంట్ బయటకు వచ్చేస్తున్న విషయం తెలిసిందే. గత వారం నయని పావని బయటకు రాగా, ఈ వారం హౌజ్ నుండి బయటకు వచ్చేందుకు గాను నామినేషన్ ప్రక్రియ జరిగింది.ఈ ప్రక్రియ చాలా వాడివేడిగానే జరిగింది. ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈ నామినేషన్స్‌లో నిఖిల్…. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఒకరు నో అన్నప్పుడు నో అనే అర్థం…వద్దని చెప్పిన కూడా యష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెట్టావని, నాపైన రూల్ బుక్ విసిరేయడం కూడా నచ్చలేదని గౌతమ్‌ని నామినేట్ చేశాడు నిఖిల్.
ఇక నువ్వు అశ్వత్థామ 2.0 అని పిలిస్తే బాధపడ్డావ్ కదా…ఈ విషయం అందరికి చెప్పుకున్నావు కదా, మరి అక్కా అని పిలవొద్దని యష్మి చెప్పినప్పుడు కూడా నువ్వు వినకుండా అలాగే పిలుస్తుంటే తనకి అదే బాధ ఉంటుంది కదా అని నిఖిల్ అన్నాడు. అయితే దానికి ఘాటుగా స్పందించిన నిఖిల్.. నువ్వు నన్ను అశ్వత్థామ అని పిలిచుకో…అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్…నిఖిల్‌తో ఛాలెంజ్ చేశాడు. అంతేకాదు బయటకు వెళ్లాక చూసుకుందాం అంటూ సవాల్ కూడా విసురుకున్నారు. నిఖిల్ చెప్పిన కూడా గౌతమ్ పదే పదే అక్క అని పిలుస్తుండడంతో నిఖిల్.. నువ్వు నాపైన కోపాన్ని ఆడపిల్లలపై చూపించొద్దని అన్నాడు. గౌతమ్‌కు రోహిణి, హరితేజ సపోర్ట్‌చేశారు. గౌతమ్ మాట్లాడింది కరెక్ట్ అన్నట్లుగా అతడి మాట్లాడిన ప్రతిసారి చప్పట్లు కొట్టారు.
నామినేషన్ సమయంలో గౌతమ్ వంతు వచ్చినప్పుడు యష్మీని నామినేట్ చేశాడు. చీఫ్ అయిన తన మీట వినకుండా గేమ్‌లో అవతలి టీమ్‌ను సపోర్ట్‌చేశావని, తప్పు చేసినప్పుడు అరవకుండా నీకు ముద్దుపెట్టి బుజ్జగించాలా అంటూ యష్మి చెప్పుకొచ్చింది. దానికి నేను ముద్దు పెట్టమని అడగలేదని గౌతమ్ సమాధానమిచ్చాడు. ఆ తర్వాత యష్మి…గౌతమ్‌ను నామినేట్ చేసింది. ఇక గౌతమ్‌ను టీమ్ నుంచి సైడ్ చేయడం బాగాలేదంటూ రోహిణి కూడా యష్మినే నామినేట్ చేసింది. విష్ణుప్రియ…ప్రేరణను నామినేట్ చేసింది. గేమ్‌లో తప్పులు చేయడం వల్లే నిన్ను నామినేట్ చేయాల్సివచ్చిందని చెప్పుకొచ్చింది. మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావని విష్ణుప్రియను నబీల్ నామినేట్ చేశాడు. టేస్టీ తేజ…పృథ్వీని….హరితేజ…ప్రేరణను నామినేట్ చేశారు. పృథ్వీ రోహిణిని నామినేట్ చేశాడు. మొత్తంగా బిగ్‌బాస్ పదోవారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ఉ న్నారు.