Bigg Boss8|బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో.. కమిటైతే లిమిటే ఉండదట.. ఏంటి ఈ మతలబు?
Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావడానికి ఎన్నో రోజులు లేదు. నిర్వాహకులు ప్రోమోలతో షోపై మరింత ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్‌లో మరింత రక్తి కట్టించబోతుంది. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున ఉంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ క్రమంలో ఇ

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కావడానికి ఎన్నో రోజులు లేదు. నిర్వాహకులు ప్రోమోలతో షోపై మరింత ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో తర్వాతి సీజన్‌లో మరింత రక్తి కట్టించబోతుంది. ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున ఉంటున్నారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ క్రమంలో ఇటీవల లోగోని ఆవిష్కరించడంతో దానిని బట్టి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అని అర్ధమైంది.ఇక తాజాగా మరో ప్రోమో విడుదల చేశారు. ఇందులో సత్య ఒక దొంగ. అతను వింటేజ్ వస్తువులు ఉండే దుకాణంలోకి వెళ్లి అనుకోకుండా దీపంని టచ్ చేస్తాడు.
అప్పుడు దీపం నుండి వరాలు ఇచ్చే కింగ్ గా నాగార్జున బయటకి వస్తారు. వరాలు ఇవ్వడంతో పాటుగా.. కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఈసారి లిమిటే లేదు అని.ఈ అన్ లిమిటెడ్ అనే పదంలోనే అసలు మతలబు ఉంది. బిగ్ బాస్ 8లోగో లో ఎనిమిదిని ఇన్ఫినిట్(అనంతం) వలే డిజైన్ చేయగా, ఇప్పుడు ప్రోమోలో నాగార్జున అన్ లిమిటెడ్ అనడంతో ఆ మాటల వెనుక ఆంతర్యం ఏమిటీ? ఈ అన్ లిమిటెడ్ కాన్సెప్ట్ ఏమిటి అనే దాని గురించి ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు. ప్రతి సీజన్‌లోను ఎదో ఒక థీమ్ తో వచ్చి ప్రేక్షకులని ఎంటర్‌టైన్ చేసే నిర్వాహకులు ఈ సారి ఎలాంటి థీమ్‌తో వస్తారో చూడాలి.
గత సీజన్ చూస్తే ఉల్టా పుల్టా అని అందరినీ బాగా ఎంటర్ టైన్ చేశారు. ఈసారి 8వ సీజన్ లోగోని ఇన్ఫినిటీలా పెట్టి ఎంటర్ టైన్మెంట్ కి లిమిట్ లేదు అని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలి అని ఫిక్స్ అయితే అందులో ఉండే టాస్కులు, చేసే పోరాటాలకు లిమిట్ లేదు అని భావించవచ్చు.ఆడియన్ పరంగా చూస్తే ఒక్కసారి బిగ్ బాస్ ని చూడటం స్టార్ట్ చేశారు అంటే.. ఇంక ఎంటర్ టైన్మెంట్, ఫన్, కామెడీకి లిమిటే లేదు అని కూడా అనుకోవచ్చు. సెప్టెంబర్ 8 నుండి షో మొదలు కానున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైనట్టు తెలుస్తుండగా, బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, రీతూ చౌదరి, విష్ణుప్రియ, సోనియా సింగ్, మై విలేజ్ షో అనిల్, ప్రభాస్ శ్రీను, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్, ఖయ్యూం అలీ ,బర్రెలక్క, వేణు స్వామి, అబ్బాస్, అంబటి అర్జున్, కిరాక్ ఆర్పీ, యాదమ్మ రాజు, వినోద్ కుమార్, నటుడు రోహిత్ పేర్లు వినిపిస్తున్నాయి.