Chiranjeevi|అట్ట‌హాసంగా మెగాస్టార్ జ‌న్మ‌దిన వేడుకులు.. చిరుతో కేక్ క‌ట్ చేయించిన ఎమ్మెల్యే

Chiranjeevi| త‌రాలు మారిన అప్ప‌టికీ ఇప్ప‌టికీ మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి గురువారం రోజు 69వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లని రెండు తెలు

  • By: sn    cinema    Aug 23, 2024 7:20 AM IST
Chiranjeevi|అట్ట‌హాసంగా మెగాస్టార్ జ‌న్మ‌దిన వేడుకులు.. చిరుతో కేక్ క‌ట్ చేయించిన ఎమ్మెల్యే

Chiranjeevi| త‌రాలు మారిన అప్ప‌టికీ ఇప్ప‌టికీ మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి గురువారం రోజు 69వ ప‌డిలోకి అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బ‌ర్త్ డే వేడుక‌లని రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఇతర దేశాల‌లో కూడా ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు ఆయ‌న అభిమానులు. ఇక శిల్పకళా వేదికగా కూడా చిరు జ‌న్మ‌దిన వేడుకల‌ని నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున జరిగిన ఈ వేడుక‌ల‌కి మెగా అభిమానులు హాజరై సందడి చేశారు. దర్శకుడు బాబీ, వశిష్ట, జానీ మాస్టర్ ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కోసి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ప్రముఖ ఫైట్ మాస్టర్ పొన్నాంబలం చెన్నై నుంచి తరలివచ్చి మెగాస్టార్​తో తనుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యారు.

అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న స‌మ‌యంలో త‌న‌కి చిరంజీవి 60 ల‌క్ష‌లకి పైగా సాయం చేసి త‌న‌ని ఆదుకున్నార‌ని గుర్తు చేసుకున్నారు. ఇక దర్శకులు బాబీ, వశిష్టలు పొన్నాంబలాన్ని ఘనంగా సత్కరించారు. నాలుగు దశాబ్దాలుగా ఆగస్టు 22 వచ్చిదంటే మెగా అభిమానులకు నిజమైన పండుగ అని బాబీ అన్నారు. సామాన్యులు జీవితంలో ఎద‌గ‌వ‌చ్చు, పోరాడి గెల‌వ‌వ‌చ్చు అని మ‌న చిరంజీవి నిరూపించారు. ఎంతో మంది అభిమానుల‌కి స్పూర్తిగా నిలిచార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక చిరంజీవి త‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా తిరుమ‌ల తిరుప‌తికి త‌న స‌తీమ‌ణితో వెళ్లారు. ఆయ‌న‌తో తిరుప‌తి ఎమ్మెల్యే కేక్ క‌ట్ చేయించి బ‌ర్త్ డే వేడుక నిర్వ‌హించారు.

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నివాసంకు చేరుకున్న చిరంజీవి దంపతులకు అభిమానులు, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు మెగాస్టార్ చిరంజీవి కేక్ కట్ చేసి సతీమణి సురేఖకు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తినిపించారు. ఈ వేడుకల్లో శ్రీమతి సురేఖతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, త‌దిత‌రులు పాల్గొన్నారు. అనంతరం తేనీటి విందు చేసిన చిరంజీవి అభిమానులతో ఫోటోలు దిగి ఆ త‌ర్వాత హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. ప్ర‌స్తుతం చిరంజీవి విశ్వంభ‌ర అనే సినిమాతో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుద‌ల కానుంది.