Pawan Kalyan | అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

Pawan Kalyan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన,అధినేత, బీజేపీ కూటమి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా

  • By: sn    cinema    Jun 21, 2024 11:50 AM IST
Pawan Kalyan | అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. వీడియో వైర‌ల్

Pawan Kalyan| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన,అధినేత, బీజేపీ కూటమి ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే వీరిద్దరూ సచివాలయంలో బాధ్యతలు సైతం స్వీకరించారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఎన్నిక‌ల‌లో గేమ్ ఛేంజ‌ర్‌గా, కింగ్ మేక‌ర్‌గా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా మ‌న్న‌న‌లు పొందారు. ఇక ఆయ‌న‌కి డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ‌లు కేటాయించారు.

బుధ‌వారం మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ పవన్ కళ్యాణ్ తొలి సంతకం చేశారు. అంతేకాకుండా త‌న శాఖలపై ఐఏఎస్ అధికారులతో రివ్యూ చేశారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు. తొలి రోజే ఏకంగా 10 గంటలపాటు సమీక్ష నిర్వహించిన పవన్ కళ్యాణ్.. తాను మిగిలిన రాజకీయ నాయకుల మాదిరి కాదనే సంకేతాలు పంపించారు. ప్ర‌స్తుతం సినిమాల‌కి దూరంగా ఉంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ రోజు అసెంబ్లీలో అడుగుపెట్టారు. త‌న పార్టీ ఎమ్మెల్యేల‌తో క‌ల‌సి వ‌చ్చి అసెంబ్లీలో సంద‌డి చేశారు.

అసెంబ్లీలోకి వ‌చ్చిన చంద్రబాబుకి స్వాగ‌తం ప‌లికారు. ఇక త‌న వంతు వ‌చ్చినప్పుడు కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ అనే నేను అంటూ ప్ర‌మాణ స్వీకారం చేశారు. అత‌నికి సంబంధించిన వీడియో వైర‌ల్ అయింది. అయ‌తే తొలిసారి అసెంబ్లీకి వ‌చ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని చూసేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు తరలివచ్చే అవకాశం ఉంది కాబ‌ట్టి వీరందరినీ ఆపడం భద్రతా సిబ్బంది వల్ల కాదు. దీనిని దృష్టిలో ఉంచుకునే ముందు జాగ్రత్త చర్యగా ..విజిటింగ్ పాసులను రద్దు చేస్తున్నట్లు అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. మ‌రోవైపు న‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ కూడా అసెంబ్లీలో ప్ర‌మాణ స్వీకారం చేశారు.