Devara| దేవ‌ర మూవీ యూనిట్‌పై తేనెటీగ‌ల దాడి.. ఆసుప‌త్రిలో 20 మంది?

Devara| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం దేవ‌ర‌. ఈ మూవీ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. చిత్ర బృందంపై ఒక్క‌సారిగా తేనెటీగ‌లు దాడి చేశాయి. ఆ స‌మ‌యంలో 20 మంది గాయాల‌పాలైన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్ర‌మాదానికి గురైన వారిని సమీప ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు

  • By: sn    cinema    May 06, 2024 8:08 PM IST
Devara| దేవ‌ర మూవీ యూనిట్‌పై తేనెటీగ‌ల దాడి.. ఆసుప‌త్రిలో 20 మంది?

Devara| యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం దేవ‌ర‌. ఈ మూవీ ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానున్న నేప‌థ్యంలో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా మోదకొండమ్మ పాదల వద్ద ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. చిత్ర బృందంపై ఒక్క‌సారిగా తేనెటీగ‌లు దాడి చేశాయి. ఆ స‌మ‌యంలో 20 మంది గాయాల‌పాలైన‌ట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్ర‌మాదానికి గురైన వారిని సమీప ఆసుప‌త్రికి త‌ర‌లించిన‌ట్టు తెలుస్తుండ‌గా, వారి ఆరోగ్య ప‌రిస్థితిపై ఆరాలు తీస్తున్నారు అభిమానులు.తమ అభిమాన న‌టుడు అక్క‌డ ఉన్నాడా, అత‌ని ప‌రిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఇక RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న చిత్రం దేవర కావ‌డంతో ఈ సినిమాపై పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తుందా అని ప్రేక్ష‌కులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై కోసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించబోతున్నారు. అలాగే షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, నరేన్, ప్రకాశ్ రాజ్, చైత్ర రాయ్, అభిమన్యు సింగ్, కళైరసన్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది.ఈ సినిమా అటు ఎన్టీఆర్, ఇటు జాన్వీకి కీల‌కం కానుంది. చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా మేక‌ర్స్ రూపొందిస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ వార్ 2 అనే చిత్రం కూడా చేస్తున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. వార్-2తో పాటు మరో బాలీవుడ్ సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గుస గుసలు వినిపిస్తున్నాయి. క‌ర‌ణ్ జోహార్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.