Extra Jabardasth| ఎక్స్ట్రా జబర్ధస్త్ క్లోజ్ చేయడానికి కారణమిదా..ఒక్కసారిగా ఇన్ని మార్పులేంటి?
Extra Jabardasth| టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షోకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సరికొత్త కామెడీ షోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జబర్ధస్త్ గురు, శుక్రవారాలలో తెగ వినోదం పంచిం

Extra Jabardasth| టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షోకి ప్రత్యేక గుర్తింపు ఉంది. సరికొత్త కామెడీ షోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జబర్ధస్త్ గురు, శుక్రవారాలలో తెగ వినోదం పంచింది. ఈ షో వచ్చిదంటే చాలు అందరూ టీవీల ముందు కూర్చుని కమెడియన్స్ స్కిట్స్ కి కడుపుబ్బా నవ్వుకుంటారు.ఈ షో ద్వారా చాలా మందికి మంచి పేరు వచ్చింది. సుధీర్, రష్మీ, ఆటో రాంప్రసాద్, ఆది లాంటి వాళ్ళు అయితే ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారు. నాగబాబు కష్టాలలో ఉన్నప్పుడు ఈ షో అతనికి ఉపాధిని కూడా అందించింది. ఇక తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా ఓ సందర్భంలో చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
టీఆర్పీ రేటింగ్స్ దూసుకుపోతున్న నేపథ్యంలో జబర్దస్త్ షోని రెండుగా చేసి ఎక్ట్సా జబర్దస్త్ అని సపరేటు షో చేశారు. ఇటీవల ఈ షోకి పెద్దగా ఆదరణ లభించడం లేదు. అందుకు కారణం పాపులారిటీస్ అంతా బయటకు పోవడమే. ఈక్రమంలోనే ఎక్ట్సా జబర్దస్త్ షోను క్లోజ్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇటీవల విడుదల అయిన ప్రొమోలో యాంకర్ రష్మీ క్లారిటీ ఇచ్చారు.గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రాజబర్దస్త్ ఉండేది. ఇప్పుడు శుక్రవారం, శనివారంలలో జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్టు తెలియజేసింది. 2020 వరకు బాగానే నవ్వులు పూయించిన జబర్ధస్త్ ఈ మధ్య బాగా వీక్ అయింది. ఇంద్రజ వచ్చాక కాస్త ఊపందుకున్న ఇప్పుడు ఆమె కూడా తప్పుకుంది. ఇక టీఆర్పీ రేటింగ్ దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలలో భాగంగా జూన్ నుంచి జబర్ధస్త్ షోని రెండు రోజుల పాటు ప్రసారం చేయనున్నారు
ప్రస్తుతం జబర్ధస్త్‌కి సిరి యాంకర్‌గా ఉండగా, ఆమెని తీసేస్తారని టాక్. మరోవైపు బాగా కామెడీ చేయలేని కమెడియన్లని కూడా తీసేస్తున్నట్టు తెలుస్తుంది. రెండు రోజుల్లో మూడు మూడు స్కిట్లు ప్రదర్శించి, మిగిలిన గ్యాప్‌లో స్టాండప్ కామెడీ చేయిస్తారని తెలుస్తుంది. గురువారం వచ్చే కొత్త షో ఏంటంటే అది ఢీ. ఇంతకముందు బుధవారం మాత్రమే ఈ షో వచ్చేది ఇప్పుడు బుధ, గురువారాలలో ఈ షోని ప్రసారం చేయనున్నట్టు తెలుస్తుంది. గురువారం సెలబ్రిటీ స్పెషల్‌గా ఈ ఢీ షోని ప్రసారం చేయబోతున్నారు. ఇందులో జడ్జ్ లు, యాంకర్లు మారడం లేదు. ఇక సోమవారం `ఆలీతో సరదా`గా షోని టెలికాస్ట్ చేయబోతున్నారట శనివారం రావాల్సిన సుమ అడ్డాని మంగళవారానికి మార్చేశారట. ఇలా పలుమార్పులు చేసి తిరిగి పూర్వ వైభవం తెప్పించేలా ప్రయత్నాలు చేస్తున్నారని టాక్